RRR Song Copy: రాజమౌళిపై కాపీ ఆరోపణలు.. ఆ స్టార్ హీరో సాంగ్‌లో ఎన్టీఆర్‌ను చూపారంటూ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ స్టేటస్‌ను అందుకోవడంతో పాటు దర్శకధీరుడుగా పేరు సంపాదించుకున్నారు ఎస్ఎస్ రాజమౌళి. వరుసగా విజయవంతంమైన చిత్రాలను చేస్తూ సక్సెస్‌కు చిరునామాగా మారిపోయారు. ఇక, ఆ మధ్య వచ్చిన 'బాహుబలి'తో దేశమే గర్వించే దర్శకుడిగా మారిపోయారు.

ఈ ఉత్సాహంతోనే ఈ స్టార్ డైరెక్టర్.. ఇద్దరు స్టార్ హీరోలతో ఇప్పుడు RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాను చేశారు. అంచనాలకు అనుగుణంగానే ఇది భారీ స్పందనను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలోని ఓ పాటపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

బడా మల్టీస్టారర్‌గా వచ్చేసింది

బడా మల్టీస్టారర్‌గా వచ్చేసింది

‘బాహుబలి'తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు నటించారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను పోషించారు.

 గ్రేట్ రెస్పాన్స్.. అంతా పాజిటివ్

గ్రేట్ రెస్పాన్స్.. అంతా పాజిటివ్

క్రేజీ కాంబోలో ప్రతిష్టాత్మకంగా వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. దీంతో అన్ని చోట్లా పండుగ వాతావరణం కనిపించింది. అలాగే, రివ్యూలు కూడా ఈ సినిమాకు పాజిటివ్‌గానే వచ్చాయి.

కలెక్షన్లతో బాక్సాఫీస్‌కు ఊరట

కలెక్షన్లతో బాక్సాఫీస్‌కు ఊరట

భారీ బడ్జెట్‌తో అంచనాలు ఏర్పరచుకుని.. RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. ఇది అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 70 కోట్లు పైగానే షేర్‌ను రాబట్టిన ఈ చిత్రం.. ఓవరాల్‌గా మొదటి రోజే రూ. 135 కోట్లకు పైగా షేర్‌ను, రూ. 220 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసింది.

 సినిమాలో ఎన్నో హైలైట్లు అని

సినిమాలో ఎన్నో హైలైట్లు అని

ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో ఎన్నో హైలైట్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇద్దరు హీరోల పరిచయ సన్నివేశాలు, ట్రైన్ ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌‌కు భారీ స్థాయిలో స్పందన దక్కింది. వీటితో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫి, విజువల్స్ ఇలా ఇంకెన్నో అంశాలు ప్రేక్షకులకు నచ్చాయి.

కొమరం భీం పాట స్పెషల్‌గా

RRR (రౌద్రం రణం రుధిరం) సినిమాలోని ‘కొమరం భీముడో' అంటూ సాగే పాటకు ఏ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాటను కాల భైరవ ప్రాణం పెట్టి పాడాడు. దీనికి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ మరింత బలాన్నిచ్చాయి. ఇక, సినిమాలో ఎన్టీఆర్ పలికించిన ఎమోషన్స్, చరణ్ చూపించిన క్రుయాలిటీ దీన్ని హైలైట్ చేశాయి.

రాజమౌళిపై కాపీ ఆరోపణలు

రాజమౌళిపై కాపీ ఆరోపణలు

సాధారణంగా రాజమౌళి తెరకెక్కించిన ఏ సినిమాకైనా ప్రశంసలు ఎలా దక్కుతాయో.. విమర్శలు కూడా అలాగే వస్తుంటాయి. దీంతోపాటు కాపీ ఆరోపణలు కూడా వస్తుంటాయి. ఇలా ఇప్పటికే చాలా సినిమాలకు జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలోని కొమరం భీముడో సాంగ్ కూడా ఓ సినిమా నుంచి తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఆ సినిమా నుంచి లేపేశారని

ఆ సినిమా నుంచి లేపేశారని

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన చిత్రం ‘దశావతారం'. ఇందులో రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు అంటూ సాగే ఓ పాట ఉంటుంది. అందులో కమల్‌ను చిత్ర హింసలకు గురి చేస్తుంటారు. దీన్ని స్పూర్తిగా తీసుకునే ఇప్పుడు RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో కొమరం భీముడో సాంగ్ డిజైన్ చేశారని కొందరు రాజమౌళిపై ట్రోల్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X