For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాక్టింగ్‌కు శృతిహాసన్ గుడ్‌బై?... ప్రియుడికి దూరమై.. కొత్త మత్తులో బ్యూటీ!

|

గత రెండేళ్లుగా శృతిహాసన్ యాక్టింగ్ దూరం కావడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో హఠాత్తుగా వెండితెరకు దూరం కావడం అంతుపట్టకుండా పోయింది. ఈ రెండేళ్ల కాలంలో ప్రియుడు మైఖేల్ కోర్సలేతోనూ, తనకు ఇష్టమైన మ్యూజిక్‌తో సన్నిహితంగా కాలం వెళ్లదీసింది ఈ బ్యూటీ. అయితే సరే బాగానే ఉంది కదా అనుకొనే సమయంలో షాక్ ఇస్తూ ప్రియుడికి గుడ్‌బై చెప్పింది. వెంటనే రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కానీ మళ్లీ నటనకు దూరమయ్యే అవకాశాలున్నాయని కొందరు గుసగుసలాడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

ప్రియుడు మైఖేల్‌కు గుడ్‌బై

కొద్ది నెలలుగా లండన్ ప్రియుడు మైఖేల్ కోర్సలేతో అఫైర్ సాగించింది శృతిహాసన్. పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. చెన్నైలో ఓ పెళ్లికి తమిళ సంప్రదాయ ప్రకారం పట్టు వస్త్రాలు ధరించి హాజరయ్యారు. దాంతో వీరిద్దరి పెళ్లి ఖాయమైందనే వార్తలు వినిపించాయి. కానీ ఇటీవల కొద్ది రోజుల క్రితం తామిద్దరం విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు.

మ్యూజిక్ వరల్డ్‌లోకి శ‌‌ృతిహాసన్

ప్రియుడితో విడిపోయింది యాక్టింగ్ కెరీర్‌పై దృష్టిపెట్టడానికని అందరూ అనుకొన్నారు. కానీ ఇప్పుడు ఈ భామ చూపంతా సంగీత ప్రపంచంపైనే. కొద్ది నెలలుగా విదేశీ గడ్డపై మ్యూజిక్ బ్యాండ్‌తో మమేకం అవుతున్నారు. గ్రామీ అవార్డు గ్రహీత, మ్యూజిక్ ప్రొడ్యూసర్ డాన్ లాంకస్టర్‌తో కలిసి పనిచేస్తున్నారు. అతనితో పనిచేయడం గొప్ప అనుభవం, అనుభూతిని కలుగచేసిందని శృతీ ఇటీవల పేర్కొన్నారు.

లండన్ సంగీత వీధుల్లో హంగామా

కొద్దికాలంగా లండన్ వీధులను తన గాన మాధుర్యంతో శృతిహాసన్ హడలెత్తిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై పాటలు పడుతూ గుర్తింపు తెచ్చుకొంటున్నారు. జనవరిలో లండన్ ఫైవ్ స్టార్ హోటల్‌ ది నెడ్‌లో లైవ్ మ్యూజిక్ ఈవెంట్‌లో పాల్గొని మీడియాలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్నది. ది ఎక్ట్రమెంటల్స్ రాక్ బ్యాండ్‌లో సభ్యురాలిగా నవంబర్‌లో ప్రదర్శన కూడా ఇచ్చింది. అవుట్ ఆఫ్ యువర్ మైండ్ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

హీరో విక్రమ్ కోసం పాట

ఇక తమిళంలో విక్రమ్ నటిస్తున్న కడారాం కోండన్ అనే సినిమా కోసం శృతిహాసన్ ఇటీవల పాడిన పాట వైరల్‌గా మారింది. ఈ పాట మే 1వ తేదీన సంగీత ప్రియుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో గాయనిగా అవకాశాలు వెతుకుంటూ వస్తున్నాయని తెలుస్తున్నది. సంగీతం అందించే మత్తు ఇప్పుడు శృతికి బాగానే కిక్కు ఇస్తున్నట్టు కనిపిస్తున్నది.

శృతిహాసన్ యాక్టింగ్‌ కెరీర్‌ గురించి

ఇక యాక్టింగ్ విషయానికి వస్తే, శృతిహాసన్ చేతిలో రెండు మూడు ప్రాజెక్టులో ఉన్నాయి. తండ్రి కమల్ హాసన్‌తో సుభాష్ నాయుడు, విజయ్ సేతుపతితో లాంబమ్, హిందీలో మహేష్ మంజ్రేకర్‌ దర్శకత్వంలో విద్యుత్ జమ్వాల్ నటిస్తున్న పవర్ చిత్రంలో నటిస్తున్నది. ఇక సుభాష్ నాయుడు సినిమా బయటకు రావడం కష్టమే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు.

English summary
Since some time, Shruti Haasan has been performing at various venues in London. Apart from showcasing her vocal skills to a live audience at The Ned, a five-star hotel, this January, she enthralled listeners at The Troubadour London, a historic live music venue in the UK capital. Just yesterday, the title track of Tamil actor Vikram’s forthcoming film, Kadaram Kondan, was released, which has been sung by Shruti.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more