45 ఏళ్ల వయసులో సింగర్ ప్రెగ్నెంట్!.. రూమర్ల వెనుక వాస్తవమెంతంటే?
పాపులర్ సింగర్ తల్లి కాబోతోంది అన్న వార్త తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న ఆ సింగర్ 45 ఏళ్ల వయసులో మళ్ళీ తల్లి కాబోతోంది అంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇంతకీ ఆ సింగర్ ఎవరు అనే విషయంపై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.
సీనియర్ సింగర్ సునీత మధుర గానానికి ఫిదా కాని వారెవ్వరు? చెప్పండి. భాషతో సంబంధం లేకుండా ఇప్పటిదాకా ఎన్నో పాటలు పాడి హీరోయిన్ల లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంది సునీత. ఇక ఆమె చెప్పే డబ్బింగ్ కు కూడా ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది.

సునీత తొలిసారిగా 1995లో గులాబీ చిత్రంతో ఈ వేళలో నీవు అనే పాటతో గాయనిగా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అనగనగా ఓ కుర్రాడు, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, రెయిన్‌బో, ఓం నమో వేంకటేశాయ వంటి అనేక ఇతర చిత్రాలలో ఆమె పాడారు.
బెస్ట్ సింగర్‌గా తొమ్మిది నంది అవార్డులు, రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ అవార్డ్స్ అందుకున్నారు. 15 సంవత్సరాల వయస్సులో ఆల్ ఇండియా రేడియో నుండి జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఆమెను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011లో మరో పాపులర్ సింగర్ లతా మంగేష్కర్ ఉత్తమ గాయని అవార్డుతో సత్కరించింది.
అయితే ప్రొఫెషనల్ లైఫ్ కంటే ఈ మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ వ్యక్తిగత జీవితంపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. వేధింపుల కారణంగా మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన సునీత ఇద్దరు పిల్లలకు తల్లి అన్న విషయం తెలిసిందే. అయితే మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత చాలా కాలం సునీత సింగిల్ గానే ఉన్నారు.

ఆ తర్వాత ఎట్టకేలకు ప్రముఖ వ్యాపారి రామ్ వీరపనేని సింగర్ సునీతను రెండో పెళ్లి చేసుకున్నారు. నిజానికి ఇది ఆమె వ్యక్తిగత విషయమే అయినప్పటికీ రెండో పెళ్లిపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సునీత కూడా దానికి గట్టిగానే సమాధానం చెప్పింది.
ఎంతోమందిని కలిసాక ఇద్దరూ ఒక అండస్టాండింగ్ తో పెళ్లి చేసుకున్నట్టు చెప్పుకొచ్చింది సునీత. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకే సింగర్ సునీత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది ఈ బ్యూటిఫుల్ సింగర్.
అయితే గత కొంతకాలంగా సునీత ఎక్కడా కనిపించకపోవడంతో మరోసారి ఆమె తల్లి కాబోతోంది అనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. 45 ఏళ్ల వయసులో సింగర్స్ సునీత ప్రెగ్నెంట్ అంటూ రూమర్లు గుప్పుమంటున్నాయి. అందుకే సునీత గత కొంతకాలం నుంచి బయట ఎక్కడా కనిపించకపోవడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే ఆమె వ్యక్తిగత పనుల వల్ల బిజీగా ఉండటం వల్ల ఆమె ఎక్కువగా కనిపించడం లేదని తెలిసింది. ఈ జరుగుతున్న ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే సునీత క్లారిటీ ఇస్తే తప్ప ఈ వార్తలకు తెరపడదు అంటున్నారు.


Click it and Unblock the Notifications











