వకీల్ సాబ్ ఫస్ట్ సింగిల్.. చరిత్రలో నిలిచిపోయే పాట.. త్రివిక్రమ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలు బయటకు వచ్చినప్పుడే ఫ్యాన్స్ సంతోషం అంతా ఇంతా కాదు. ఇక వెను వెంటనే ప్రాజెక్ట్స్ ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వరుసగా మూడు చిత్రాలను లైన్‌లో పెట్టిన పవన్.. షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్, పవన్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను ఊపేస్తుండగా.. తాజాగా మరో విషయం బయటకు వచ్చింది.

ఫస్ట్ లుక్ వైరల్..
వకీల్ సాబ్ అంటూ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌కు కేవలం ఫ్యాన్స్ నుంచే కాకుండా సెలెబ్రిటీల నుంచి కూడా విపరీతమైన స్పందన వచ్చింది. క్షణాల్లో ఈ ఫస్ట్ లుక్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఫస్ట్ సింగిల్ కూడా రెడీ..
ఫస్ట్ సింగిల్‌పై తమన్ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనెలా హైప్ పెంచేశాడు. ఈ పాటకు సంబంధించి ట్వీట్స్ చేయడం, సిద్ శ్రీరామ్ పాడుతున్నాడని చెప్పడం లాంటివి ఫస్ట్ సింగిల్‌పై అంచనాలు పెంచేశాయి.
రామ్ జో ట్వీట్
పాటల రచయిత రామ జోగయ్యశాస్త్రి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మధ్య ఆయన బుట్టబొమ్మ సాంగ్ మీద ఎవరో కామెంట్ చేస్తూ.. దీనికి రాసి పెట్టి ఉంది.. దీన్ని మించిన సాంగ్ రాదా? అన్నట్లుగా రాసుకొచ్చాడు. వాటికి రామ్‌జో రిప్లై ఇస్తూ.. ఇంకో వారం ఆగాలి అంటూ ట్వీట్ చేశాడు.
Recommended Video


నిలిచిపోయే పాట..
‘త్రివిక్రమ్ గారు నిన్న ఒక పాట వింటూ ఇది Ramjo కదా అని గుర్తుపట్టారట ...సంతోషం అనిపించిది...ఇవ్వాళ మాట్లాడా..నిలిచిపోయే పాట అవుందని చెప్పారు ..నిజంగానే ' అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇది కచ్చితంగా వకీల్ సాబ్ పాటే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఫస్ట్ సింగిల్ రాబోతోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











