‘త్రివిక్రమ్ శ్రీనివాస్ టార్చర్.. సినిమాను, ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా!’
సినిమా పరిశ్రమలో తమ విజన్ ప్రకారం అనుకొన్న అవుట్ పుట్ వచ్చేంత వరకు దర్శక, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని పంచేందుకు తమ క్రియేటివిటీకి పదును పెడుతుంటారు. అలాంటి క్రమంలో కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ రావడం సహజం. కానీ ఆ విభేదాలు ఆ సినిమా వరకే.. అలాంటి విషయాన్ని ఇటీవల మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో పంచుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
మిస్టర్ బచ్చన్ చిత్రంలోని పాటలు నా మ్యూజిక్‌కు భిన్నంగా కనిపిస్తాయి. ఇప్పటి వరకు కేవలం మెలోడిస్ మాత్రమే కంపోజ్ చేస్తారనే పేరు ఉంది. కానీ హరీశ్ శంకర్ నాతో మాస్ బీట్స్ కంపోజ్ చేయించారు. చాలా మంది ఆ పాటలు విన్న తర్వాత మీరే చేశారా? అని అడిగారు. అయితే కంటెంట్‌ను బట్టి పాట వస్తుందని చెప్పానని మిక్కి జే మేయర్ అన్నారు.

ఇక కొన్నిసార్లు దర్శక, నిర్మాతలతో చాలా గొడవలు వస్తుంటాయి. వారు అనుకొనేంత వరకు మా వెంట పడుతుంటారు. వారి కోసం చాలా సార్లు లిరిక్స్, మ్యూజిక్ మార్చేస్తుంటాను. కొన్నిసార్లు దర్శకులు పట్టుబట్టే తీరు చాలా అసహనానికి గురి చేస్తుంటుంది అని మిక్కి జే మేయర్ అన్నారు.
తివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓసారి ఓ సినిమా విషయంలో నాకు నాపైనే అనుమానం వచ్చింది. అఆ సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేశాను. రంగ్ దే పాట కోసం 7 సార్లు ట్రయల్స్ చేశాను. అప్పటికే 6ప పాటు పూర్తి చేశాను. ఏడో పాట కోసం నేను చేసిన ట్యూన్‌ను అదేపనిగా రిజెక్ట్ చేస్తున్నారు. దాంతో ఆయన టార్చర్ భరించలేక నేను ఓ దశలో సహనం కోల్పోయాను. ఆ సమయంలో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని అనుకొన్నాను అని చెప్పారు.

ఇక మరో సందర్భంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. నాకు దర్శకుడికి గొడవైంది. నేను ఏది చేసినా మరేదో కావాలని పట్టుబట్టారు. దాంతో నా టాలెంట్‌పై నాకే అనుమానం కలిగింది. నాకు మ్యూజిక్ రాదనే విధంగా ఫీలింగ్ కలిగింది. ఓ దశలో ఆయన టార్చర్ భరించలేక నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్దామని అనుకొన్నాను. ఐటీలో ఏదైనా ఉద్యోగం చూసుకొందామా? అనే ఫీలింగ్ కలిగింది అని మిక్కి జే మేయర్ అన్నారు.
అయితే తాను అమెరికాలో ఉండటం వల్ల తక్కువ ప్రాజెక్టులు చేస్తున్నాను. నాకు ఎక్కువ ప్రాజెక్టులు చేయాలనే కోరిక కూడా లేదు. నాకు నచ్చిన వాళ్లు పని ఇస్తే చేద్దామని అనుకొంటాను. కల్కి సినిమాకు కూడా అవకాశం వచ్చింది. నేనే చేయకూడదని నాగ్ అశ్విన్‌కు చెప్పాను అని మిక్కి తెలిపారు.


Click it and Unblock the Notifications











