Don't Miss!
- News అక్కడ వైసీపీని ఢీ కొట్టేదెవరు?
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
Jai Balayya: పుష్పను దాటిన వీరసింహారెడ్డి.. చిరంజీవి రికార్డు మాత్రం సేఫ్
'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో ఫుల్ జోష్ మీద ఉన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ ఉత్సాహంతోనే ఆయన ఇప్పుడు 'వీరసింహారెడ్డి' అనే సినిమాను చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో రాబోతున్న ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆరంభంలోనే తారాస్థాయిలో ఏర్పడ్డాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో చిత్రీకరణను చేస్తున్నారు.
బోల్డు షోలో హద్దు దాటిన పాయల్: కాలు పైకి లేపి.. అలా సైగలు చేస్తూ!
అదిరిపోయే కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'వీరసింహారెడ్డి' మూవీ ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ జోనర్‌తో తెరకెక్కుతోంది. ఇక, ఈ సినిమా నుంచి శుక్రవారమే 'జై బాలయ్య జైజై బాలయ్య' అంటూ సాగే ఓ మాస్ ఏంథమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ పాటకు అన్ని వర్గాల శ్రోతల నుంచి విశేషమైన స్పందన దక్కింది. ఫలితంగా ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ అండ్ లైక్స్ దక్కాయి. ఇలా ఈ మాస్ సాంగ్ 24 గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్‌తో పాటు 208K లైకులను కూడా సొంతం చేసుకుని సత్తా చాటింది.
'వీరసింహారెడ్డి' సినిమా నుంచి 'జై బాలయ్య జైజై బాలయ్య' సాంగ్ విడుదలైన వెంటనే.. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'వాల్తేరు వీరయ్య' మూవీలోని బాస్ పార్టీ అంటూ సాగే పాటతో దీన్ని పోల్చి చూస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా మెగా, నందమూరి ఫ్యాన్స్ పోటీపోటీగా పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. బాస్ పార్టీ సాంగ్‌కు 24 గంటల్లో ఏకంగా 9.51 మిలియన్ వ్యూస్‌తో పాటు 250.6K లైకులు దక్కాయి. వీటిని మాత్రం బాలయ్య సాంగ్ దాటలేకపోయింది. దీంతో ఈ పోటీలో మాత్రం మెగా అభిమానులతో పైచేయి అయిందని చెప్పొచ్చు.
పబ్లిక్‌లోనే హీరోయిన్ శ్రీయ కొంటె పని: నా భర్తకు అలా చేస్తేనే ఇష్టమంటూ షాకింగ్‌గా!
ఇదిలా ఉండగా.. 'వాల్తేరు వీరయ్య' సాంగ్‌ను దాటలేకపోయినప్పటికీ.. వీరసింహారెడ్డి సినిమాలోని 'జై బాలయ్య' సాంగ్ మాత్రం 'పుష్ప' మూవీలోని శ్రీవల్లి పాట రికార్డును బ్రేక్ చేసేసింది. అది 24 గంటల్లో 6.98 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. అలాగే, మహేశ్ బాబు సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ 6.96 మిలియన్ వ్యూస్‌తో దీని తర్వాత నిలిచాయి.