Devara: 100తో మరో రికార్డు కొట్టిన ఎన్టీఆర్.. అందులో మాత్రం సమంతనే తోపు

సాధారణంగా ఏ హీరో అయినా హిట్ కొట్టాలంటే చాలా కష్టంగా మారింది. అలాంటిది కొందరు మాత్రం వరుసగా విజయాలను అందుకుంటూ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగిన అతడు.. మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు 'దేవర'లో నటిస్తున్నాడు.

టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రమే 'దేవర'. గతంలో ఎన్నడూ చూపించని ఓ యాక్షన్ కాన్సెప్టుతో దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తీస్తున్నారు. ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఇప్పటికే లీక్ అయింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు.

Jr NTR Devara Movie Chuttamalle Telugu Song Reached 100 Million Views

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. అందులో మొదటి పార్ట్ షూటింగ్ శరవేగంగా సాగుతూ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా కీలకమైన షెడ్యూల్‌ను జరుపుకుంది. ఇప్పటి వరకూ దీనికి సంబంధించి 95 శాతం పైగానే షూటింగ్ కంప్లీట్ అయింది. ఇటీవలే ఎన్టీఆర్ కూడా తన పార్ట్‌ను పూర్తి చేసేశాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'దేవర' సినిమా మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫియర్ సాంగ్ వచ్చింది. ఈ క్రమంలోనే గత నెలలోనే 'చుట్టమల్లే' అంటూ సాగే మెలోడీ పాట కూడా విడుదల అయింది. దీనికి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఫలితంగా ఈ సాంగ్ బాగా సక్సెస్ అయిపోయింది.

దేవర మూవీలోని 'చుట్టమల్లే' సాంగ్‌కు మొదటి నుంచీ అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఈ పాట ఎన్నో రికార్డులు కూడా నమోదు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ సాంగ్ అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల వ్యూస్ అందుకుని మరో ఘనతను సాధించింది. తద్వారా టాలీవుడ్‌ నుంచి వచ్చి వేగంగా ఈ మార్కును చేరుకున్న సాంగ్‌గా ఇది సత్తా చాటుకుంది.

Jr NTR Devara Movie Chuttamalle Telugu Song Reached 100 Million Views

దేవర మూవీ నుంచి వచ్చిన 'చుట్టమల్లే' అంటూ సాగే పాటకు తెలుగులో తాజాగా 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది 29 రోజుల్లో ఈ మార్కును చేరుకుంది. తద్వారా వేగంగా 100 మిలియన్స్ కొట్టిన రెండో సాంగ్‌గా ఇది నిలిచింది. ఈ లిస్టులో 'పుష్ప' మూవీలోని ఊ అంటావా పాట మొదటి స్థానంలో ఉంది. అది కేవలం 19 రోజుల్లోనే ఆ మార్క్ చేరుకుంది.

ఇదిలా ఉండగా.. క్రేజీగా రాబోతున్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: jr ntr devara chuttamalle
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X