సెంచరీ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లో టాప్ మూవీగా దేవర రికార్డ్

టాలీవుడ్‌లో తనదైన సినిమాలు చేస్తూ సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా ప్రభావాన్ని చూపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ మధ్య కాలంలో అయితే ఈ బడా హీరో రేంజ్ వరల్డ్‌ వైడ్‌కు చేరిపోయింది. అలా ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. మరింత ఉత్సాహంతో ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర' అనే సినిమాలో నటిస్తున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'దేవర'. గతంలో ఎన్నడూ చూపించని ఓ సరికొత్త పాయింట్‌తో దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తీస్తున్నారు. ఇందులో తారక్ డబుల్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే సమాచారం బయటకు వచ్చేసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని హై ఓల్టేజ్ యాక్షన్‌తో తీస్తున్నారు.

Jr NTR Starrer Devara Movie Chuttamalle Song Reached 100 Million Views

పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'దేవర' మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. అందులో మొదటి పార్ట్ షూటింగ్ శరవేగంగా సాగుతూ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా కీలకమైన షెడ్యూల్‌ను జరుపుకుంది. ఇప్పటి వరకూ దీనికి సంబంధించి 90 శాతం పైగానే షూటింగ్ కంప్లీట్ అయింది. ఇటీవలే ఎన్టీఆర్ కూడా తన పార్ట్‌ను కంప్లీట్ చేసుకున్నాడు.

ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 'దేవర' సినిమా మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫియర్ సాంగ్ వచ్చింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే 'చుట్టమల్లే' అంటూ సాగే మెలోడీ పాట కూడా విడుదల అయింది. దీనికి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఫలితంగా ఈ సాంగ్ సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయింది.

Jr NTR Starrer Devara Movie Chuttamalle Song Reached 100 Million Views

'చుట్టమల్లే' సాంగ్‌కు మొదటి నుంచీ అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ పాట ఎన్నో రికార్డులు నమోదు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ సాంగ్ తాజాగా 100 మిలియన్ల వ్యూస్ అందుకుని మరో ఘనతను సాధించింది. తద్వారా టాలీవుడ్‌ నుంచి వచ్చి వేగంగా ఈ మార్కును చేరుకున్న సాంగ్‌గా ఇది అదిరిపోయే రికార్డును నమోదు చేసుకుంది.

దేవర మూవీ నుంచి వచ్చిన 'చుట్టమల్లే' అంటూ సాగే పాటకు తెలుగులో 70.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే, హిందీలో 21.2 మిలియన్లు, తమిళంలో 4.9 మిలియన్లు, కన్నడంలో 2.1 మిలియన్లు, మలయాళంలో 1.9 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇలా ఈ పాట అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది.

Jr NTR Starrer Devara Movie Chuttamalle Song Reached 100 Million Views

ఇదిలా ఉండగా.. సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోతున్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Read more about: jr ntr devara chuttamalle
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X