అల్లు అర్జున్ రికార్డ్ బ్రేక్ చేసిన ఎన్టీఆర్.. టాప్ మూవీగా దేవర సంచలనం
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా.. యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్, సాంగ్స్, డైలాగ్స్‌తో మాయ చేస్తోన్న అతడు.. సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉన్నాడు. ఫలితంగా స్టార్‌డమ్‌ను మరింతగా పెంచుకుంటూ వెళ్తున్నాడు. అంతేకాదు, ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర' సినిమాను చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి వచ్చిన ఓ సాంగ్ అల్లు అర్జున్ రికార్డును బ్రేక్ చేసేసింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!
దేవరగా రాబోతున్న ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'దేవర'. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు నటిస్తున్నారు.

పవర్‌ఫుల్ స్టోరీ.. డబుల్‌గా
కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో పవర్‌ఫుల్ కాన్సెప్టుతో రూపొందుతోన్న చిత్రమే 'దేవర'. గతంలో ఎన్నడూ చూపించని ఓ సరికొత్త పాయింట్‌తో కొరటాల శివ దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తీస్తున్నాడు. ఇందులో తారక్ డబుల్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే సమాచారం బయటకు వచ్చేసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని రూపొందిస్తున్నారు.
షూటింగ్ పరిస్థితి ఏంటి?
హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'దేవర' మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. అందులో మొదటి పార్ట్ షూటింగ్ శరవేగంగా సాగుతూ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా కీలకమైన షెడ్యూల్‌ను జరుపుకుంది. ఇప్పటి వరకూ దీనికి సంబంధించి 90 శాతం పైగానే షూటింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన దాన్ని కూడా ఈ నెలలోనే పూర్తి చేయనున్నారు.

చుట్టమల్లే చుట్టేసిందిగా
ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 'దేవర' సినిమా మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫియర్ సాంగ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవలే 'చుట్టమల్లే' అంటూ సాగే మెలోడీ పాట కూడా వచ్చింది. దీనికి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఫలితంగా ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది.
అరుదైన రికార్డును కొట్టేసి
'చుట్టమల్లే' సాంగ్‌కు మొదటి నుంచీ మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ పాట ఒక్కరోజులోనే ఎక్కువ వ్యూస్ సాధించి టాలీవుడ్‌లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. అలాగే, ఈ పాట రీల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'దేవర' మూవీలోని ఈ సాంగ్ తాజాగా యాభై మిలియన్ల వ్యూస్ అందుకుని మరో ఘనతను చేరుకుంది.

బన్నీ ఔట్.. టాప్ 2లోనే
'చుట్టమల్లే' అంటూ సాగే పాటకు అద్భుతమైన స్పందన వస్తూనే ఉంది. తద్వారా ఇది కేవలం ఆరు రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ సాధించింది. దీంతో టాలీవుడ్‌లో వేగంగా ఈ మార్కును చేరిన 'ఊ అంటావా' పాట రికార్డును ఇది బ్రేక్ చేసింది. తద్వారా తెలుగులో టాప్ ప్లేస్‌కు చేరింది. ఇండియా మొత్తంలో అయితే 'అరబిక్ కుత్తు' తర్వాతి స్థానంలో అంటే టాప్ 2లో ఉంది.


Click it and Unblock the Notifications











