Devara: ఎన్టీఆర్ మూవీ నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్.. దేశం మొత్తం షేక్ అవడం ఖాయం

తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎంతో మంది హీరోలుగా వచ్చినా.. అందులో కొందరు మాత్రమే వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. అంతలా అతడు ఈ మధ్య కాలంలో డబుల్ హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకోవడంతో పాటు పాన్ ఇండియా స్టార్‌గానూ మారిపోయిన విషయం తెలిసిందే.

బీభత్సమైన ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తోన్న చిత్రమే 'దేవర'. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో హై రేంజ్ యాక్షన్‌తో రాబోతోంది. దీంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. అంతేకాదు, దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు.

Jr NTR Starrer Devara Movie Second Song Release On July 19th

'జనతా గ్యారేజ్' వంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో తెరకెక్కుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి అస్సలు విరామం లేకుండా చిత్రీకరణను జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే 85 శాతం కంటే ఎక్కువగానే టాకీ పార్టును పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా త్వరగానే కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు.

పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 'దేవర' మూవీ మొదటి భాగాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, షూటింగ్ ఆలస్యం కావడంతో దీన్ని అక్టోబర్ 10 తేదీకి పోస్ట్‌పోన్ చేసేశారు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీకి ప్రీపోన్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Jr NTR Starrer Devara Movie Second Song Release On July 19th

'దేవర' మూవీ రిలీజ్‌‌కు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఓ సాంగ్ వదిలింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేయబోతున్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌పై తెరకెక్కించిన ఈ ఊరమాస్ సాంగ్‌ను జూలై 19న తీసుకు వస్తున్నట్లు తెలిసింది. ఈ పాటతో ఇండియా మొత్తం షేక్ అవడం ఖాయం అని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రాబోతున్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Read more about: devara jr ntr koratala shiva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X