Devara: దేవర నుంచి టైటిల్ సాంగ్ లీక్.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా!
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. అందులో అందరి కంటే ముందున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్న అతడు.. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపకల్పనలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తోన్న సినిమానే 'దేవర'. ఈ మూవీని కోస్టల్ ఏరియా నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని క్రేజీగా తీస్తున్నారు. అందుకే ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

వైల్డ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, అనివార్య కారణాలతో దీన్ని అక్టోబర్ 10వ తేదీకి పోస్ట్‌పోన్ చేశారు. అప్పటి వరకూ సినిమా షూటింగ్‌తో పాటు మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసేలా ప్లాన్లు చేసుకుంటూ వెళ్తున్నారు.
పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్‌కు జూనియర్ ఎన్టీఆర్ విరామం ప్రకటించాడు. ఈ గ్యాప్‌లో చిత్ర యూనిట్ మ్యూజిక్‌ను ఫైనల్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే అనిరుథ్ ఇప్పటికే కొన్ని సాంగ్స్ కూడా రెడీ చేశాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సాంగ్ లీక్ అయింది.
హై రేంజ్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న 'దేవర' మూవీ నుంచి టైటిల్ సాంగ్ అంటూ ఓ పాట సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇందులో 'దేవర.. వినాశకాల కింకర.. దేవర.. నిఘార ఘోర భీకర' అనే లిరిక్స్ వినిపించాయి. అయితే, ఈ పాట ఫ్యాన్స్ మేడ్ అని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం నిజమైనదే అంటున్నారు. దీంతో ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ - కొరటాల కలిసి చేస్తున్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











