దేవుడా ఎందుకీ శిక్ష.. అందుకే డ్రగ్స్‌కు బానిసను అయ్యా.. జస్టిన్ బీబర్ సంచలన ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను తన మ్యూజిక్‌తో ఉర్రూతలూగించిన పాప్ స్టార్ జస్టిన్ బీబర్ డ్రగ్స్ వాడకం గురించి అసలు విషయాలను తన అభిమానులతో పంచుకొన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా జస్టిన్ బీబర్ డ్రగ్స్‌కు వ్యసనం కావడం అందర్నీ ఆందోళనకు గురిచేసింది. అయితే తాను ఎందుకు డ్రగ్స్‌కు బానిస కావాల్సి వచ్చిందనే విషయాన్ని వెల్లడిస్తూ...

జీవితంలో ఏదో తెలియని అసంతృప్తి

జీవితంలో ఏదో తెలియని అసంతృప్తి

సంవత్సరాలు గడుస్తున్న కొద్ది ఎంతో పాపులారిటీ సాధించాను. అంతేకాకుండా చిన్న వయసులోనే ఎన్నో విజయాలను చవిచూశాను. అది నాకు ఎంతో ఉత్సాహాన్ని, తృప్తిని ఇచ్చింది. అయినా నాలో ఏదో తెలియని అసంతృప్తి. ఆ బాధ నన్ను వెంటాడుతూ ఉండేది. ఎన్నో అపరిషృత సమస్యలను నన్ను వేధించేవి అంటూ జస్టిన్ బీబీర్ పేర్కొన్నారు.

డ్రగ్స్ మత్తులో ఒత్తిడికి దూరంగా

డ్రగ్స్ మత్తులో ఒత్తిడికి దూరంగా

నా జీవితంలో నేను సాధించిన విజయాల విషయంలో నేను సంతృప్తి కలుగలేదు. అందుకే ఒత్తిడి నుంచి తట్టుకోవడానికి డ్రగ్స్ వాడటం మొదలుపెట్టాను. డ్రగ్స్ మత్తులో ఒత్తిడికి దూరమయ్యాను. ఆ అలవాటు నన్ను బానిసగా మార్చింది అంటూ బీబీర్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇబ్బందిగా మారిన అఫైర్లు

ఇబ్బందిగా మారిన అఫైర్లు

యుక్త వయసులో ఉన్న సమయంలో ఆవేశం, భారీగా కలలు, లక్ష్యాలు ఉండటం సహజం. ప్రపంచం కూడా నీ నుంచి చాలా ఆశిస్తుందనే విషయం కుదురుగా ఉండనివ్వదు. ఆ సమయంలో ఉండే అఫైర్లు చాలా ఇబ్బందిగా మారుతాయి. అలాంటి పరిస్థితుల్లో వాటిని తగలేయ్యాలనిపిస్తుంది. నేను ఇంకా ఏమీ సాధించలేదనే బాధ అప్పుడు అనిపిస్తుంది అని జస్టిన్ బీబర్ పేర్కొన్నారు.

Recommended Video

Radhe Shyam Teaser Update : Prabhas స్టైలింగ్ కి ఫ్యాన్స్ ఫిదా
దేవుడా.. నీ సహాయం కోసం

దేవుడా.. నీ సహాయం కోసం

దేవుడు అద్భుతమైన వ్యక్తి అని బలంగా నమ్ముతాను. ఒకవేళ దేవుడే నిజమైతే.. ఆయన నుంచి ఎంతో సహాయాన్ని పొందుతాను. ఎందుకంటే నా అంతట నేను రాణించలేను. కాబట్టి భగవంతుడి కృప ఉండాలని కోరుకొంటాను. అందుకే నేను చాలా విషయాల్లో ఆటుపోట్లకు గురి అవుతుంటాను. నేను తీసుకొన్న ప్రతీ నిర్ణయం నాలోని ఇగోని స్పష్టంగా తెలియజేస్తుంది. భగవంతుడా నాకు ఎందుకీ శిక్ష అనిపిస్తుంది జస్టిన్ బీబర్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X