పూలు, పండ్లు లేకుండానే రాఘవేంద్రరావు రంగంలోకి.. పెళ్లిసందD సెట్లో అలా..
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో పాటలు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయని చెప్పవచ్చు. ఎమ్ఎమ్.కీరవాణితో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆయన మరచిపోలేని మ్యూజికల్ సినిమాలను తెరకెక్కించారు. ఇక 25ఏళ్ళ అనంతరం మరో పెళ్లి సందD అంటూ జనాలను ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు.
ఇదివరకే నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన రోషన్ ఇప్పుడు కె.రాఘవేంద్రరావు సినిమాతో రీ లాంచ్ అవుతున్నాడు. నేటి యువతకు నచ్చే విధంగా పెళ్లి సందడి సినిమాతోనే మ్యూజికల్ హిట్ కొట్టాలని చూస్తున్న రాఘవేంద్రరావు అనుకున్నట్లే మొదటి పాటతోనే మెప్పించారు. ప్రేమంటే ఏంటి? అనే మెలోడీ సాంగ్ ను ఈ రోజు విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఇలాంటి మెలోడీ సాంగ్ లో కె.రాఘవేంద్రరావు పూలు, పండ్లు లాంటి స్టైల్ ను పక్కన పెట్టేయడం విశేషం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో స్టైలిష్ గా ప్రజెంట్ చేశారు. ఇక రోషన్ సరికొత్త లుక్కుతో ఆకట్టుకుంటున్నాడు. అతను లవర్ బాయ్ గా క్రేజ్ అందుకునే అవకాశం ఉన్నట్లు కామెంట్స్ చాలానే వస్తున్నాయి.

ఇక న్యూ హీరోయిన్ శ్రీలీల కూడా తన లుక్స్ తో ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంటోంది. మొత్తానికి కీరవాణి ఈ సాంగ్ తో మళ్ళీ మెలోడీ అనే పదానికి అర్దాన్ని తెచ్చినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కోవిడ్ పరిస్థితులు అదుపులోకి వచ్చిన అనంతరం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











