వస్తూనే రికార్డుల వేట మొదలు పెట్టిన సర్కారు వారి 'పాట'.. కళావతి రిలీజ్ అయిన వెంటనే రికార్డు బ్రేక్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అయింది. లీకేజ్ కారణంగా ఫిబ్రవరి 14న విడుదల కావాల్సిన కళావతి అనే సాంగ్ ను ముందే విడుదల చేశారు. ఈ పాట అలా రిలీజ్ అయిందో లేదో, ఇలా రికార్డుల వేట మొదలు పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే

భారీ రెస్పాన్స్

భారీ రెస్పాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న చిత్రం సర్కారు వారి పాట. గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమా మీద మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఇక ఇప్పటికే విడుదలైన కళావతి సాంగ్ ప్రోమోకు కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

 సోషల్ మీడియాలో లీక్

సోషల్ మీడియాలో లీక్

ఆ ప్రోమోలో మహేష్ పూర్తిగా స్టైలీష్ అండ్ హ్యాండ్స‏మ్ లుక్‏లో కనిపిస్తున్న క్రమంలో పూర్తి సాంగ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. నిజానికి కళావతి అనే సాంగ్ ను ముందుగా వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికుల రోజున విడుదల చేయనున్నట్లు సినిమా ప్రకటించింది. అయితే రెండ్రోజుల ముందు ఈ సాంగ్ పూర్తిగా సోషల్ మీడియాలో లీక్ అయ్యి షాకిచ్చింది.

 ఒకరోజు ముందే

ఒకరోజు ముందే

దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఒకరోజు ముందే అంటే ఈరోజే ఈ సినిమా నుంచి కళావతి పూర్తి సాంగ్ ను సోషల్ మీడియాలో విడుదల చేసింది చిత్రయూనిట్. వందో.. ఒక వెయ్యో అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పాటను ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ ఆలపించగా.. తమన్ సంగీతం అందించారు. అలాగే అనంత శ్రీరామ్ కలం నుంచి పాట బయటకొచ్చింది. .

మే 12న విడుదల

మే 12న విడుదల


ఇక ఈ సినిమాకు మొదటి నుంచి లీకుల బెడద తప్పడం లేదు. గతంలో టీజర్ లీక్ కాగా ఇప్పుడు కళావతి సాంగ్ లీక్. ఈ విషయం మీద పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వేసవిలో మే 12న విడుదల చేయనున్నారు.

Recommended Video

SSMB 28 రెండో హీరోయిన్ వేట | Sarkaru Vaari Paata ఓవర్సీస్ రేంజ్ || Filmibeat Telugu
రికార్డు టైంలో

రికార్డు టైంలో

ఇక కళావతి పాటకు భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా సాంగ్ విడుదల అయిందో లేదో మహేష్ ఫ్యాన్స్ సహా టాలీవుడ్ ఫ్యాన్స్ అంతా సన్గ్ మీద ద్రుష్టి పెట్టారు. ఇప్పటికే వ్యూస్ గట్టిగా వస్తూ ఉండగా ఇప్పుడు ఈ సాంగ్ టాలీవుడ్ లిరికల్ సాంగ్స్ లో ఫాస్ట్ గా 100 k లైక్స్ అందుకున్న సాంగ్ గా నిలిచింది. కేవలం 9 నిముషాల్లోనే సాంగ్ ఆ ఘనత సాధించింది. అంతకు ముందు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ 11 నిముషాల్లో ఈ ఫీట్ సాధించింది.

More from Filmibeat

Read more about: sarkaru vaari paata
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X