మరో రికార్డును అందుకున్న కళావతి.. భీమ్లా నాయక్, పుష్ప సాంగ్స్ కంటే వేగంగా..
సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో రికార్డులు చాలా హాట్ టాపిక్ గా మారాయి విడుదలకు ముందే సోషల్ మీడియాలో అలాగే యూట్యూబ్ లో కూడా సినిమా ఎంతవరకు ట్రెండ్ అయిందని విషయం చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ఒక విధంగా సినిమా మార్కెట్ కు కూడా అది ఎంతగానో హెల్ప్ అవుతుంది అనే చెప్పాలి. ప్రస్తుతం లిరికల్ వీడియో సాంగ్స్ కూడా సినిమాలపై అంచనాలు ఒక్కసారిగా పెంచేస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన కళావతి పాట కూడా సర్కారు వారి పాట సినిమా పై అంచనాలు స్థాయిని అమాంతంగా పెంచేసింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని చాలా క్లారిటీగా అర్ధమైపోయింది.
మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో పాట మహేష్ బాబు జిఎంబి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని కూడా అభిమానులు ఎంతగానో నమ్ముతున్నారు. అయితే కళావతి పాట సౌత్ ఇండస్ట్రీ లో 24 గంటల్లో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న టాప్ లిరికల్ సాంగ్ గా గుర్తింపు అందుకుంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల కళావతి సాంగ్ మరో రికార్డును కూడా అందుకుంది.

ఇప్పటికే 22 మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న కళావతి లిరికల్ వీడియో సాంగ్ భీమ్లా నాయక్ కు సంబంధించిన ఒక పాత రికార్డును కూడా బ్రేక్ చేసింది. అత్యధిక వేగంగా 1 మిలియన్ల లైక్స్ అందుకున్న పాటగా కూడా కళావతి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 68 గంటల 25 నిమిషాలలో ఈ రికార్డును అందుకోగా భీమ్లా నాయక్ 101గంటల 35 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ అందుకుంది. ఇక పుష్ప సినిమాలోని ఐటెమ్ సాంగ్ ఉ అంటావా సాంగ్ 123 గంటల్లో 1 మిలియన్ లైక్స్ అందుకుంది. చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పవచ్చు.
ఇక సినిమాను మే 12వ తేదీన విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అసలైతే సర్కారు వారి పాట ఈ సంక్రాంతికే విడుదల కావాల్సింది. కానీ అప్పుడు మిగతా సినిమాల నుంచి పోటీ ఉండడం అలాగే కోవిడ్ కారణాల వలన వాయిదా వేయక తప్పలేదు. ఇక అప్డేట్స్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ సభ్యులు ఆలస్యం చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని పాటలను వెంటనే విడుదల చేయాలని అనుకుంటున్నారు.. మొత్తానికి మొదటి పాట అయితే భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న లిరికల్ వీడియో సాంగ్ కోసం ప్రత్యేకంగా 40 లక్షల వరకు నిర్మాతలు ఖర్చు చేసినట్లు సమాచారం.
థమన్ కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా అనంతరం మహేష్, త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలతో బిజీ కానున్నాడు.


Click it and Unblock the Notifications











