బాబాయ్ పాటలో రెచ్చిపోయిన కల్యాణ్ రామ్.. ఎన్నో రాత్రులోస్తాయి అంటూ బాలకృష్ణ, దివ్యభారతీ పాట రీమిక్స్
నందమూరి కల్యాణ్ రామ్, అశికా రంగనాథ్ జంటగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం అమీగోస్. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్ నిర్మించారు. జీబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ఎన్నో రాత్రులు వస్తాయి గానీ పాటను తాజాగా రిలీజ్ చేశారు. అయితే గతంలో నందమూరి బాలకృష్ణ, దివ్య భారతీ నటించిన ధర్మక్షేత్రం సినిమాలోని ఎన్నో రాత్రులు పాటను రీమిక్స్ చేసి.. నేటి యువత అభిరుచికి తగినట్టుగా చిత్రీకరించారు. ఈ పాటకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఎన్నో రాత్రులోస్తాయి అంటూ దివ్య భారతీతో
బాలకృష్ణ, దివ్య భారతిపై చిత్రీకరించిన ఎన్నో రాత్రులోస్తాయి గానీ పాటకు లయరాజ ఇళయరాజా సంగీతం అందించారు. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం, మనో, ఎస్ జానకి, చిత్ర ఆలపించారు. ఈ సినిమా పాటకు వేటూరి సాహిత్యాన్ని అందించారు. అప్పట్లో ఈ పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది.
దివ్య భారతీతో బాలకృష్ణ కెమిస్ట్రీ
బాలకృష్ణ, దివ్య భారతీ జంటగా ఎన్నో రాత్రులోస్తాయి గానీ అనే పాటపై వారిద్దరి రొమాన్స్‌కు అప్పట్లో మంచి స్పందన వచ్చింది. నైట్ ఎఫెక్ట్‌లో సాగే పాటపై బాలయ్య, దివ్య భారతీ రెచ్చిపోయి సున్నితమైన కెమిస్ట్రీని పలికించారు. ఇప్పటికీ ఆ పాట ఈ తరం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది.

బాబాయ్ పాటపై అబ్బాయి రొమాన్స్
తాజాగా బాబాయ్ కెరీర్‌లో టాప్ పాటగా నిలిచిన ఎన్నో రాత్రులోస్తాయి గానీ పాటను నందమూరి కల్యాణ్ రామ్, అశికా రంగనాథ్‌పై చిత్రీకరించిన పాటకు జిబ్రాన్ మ్యూజిక్ అందించారు. ఎస్బీ బాలు తనయుడు ఎస్పీబీ చరణ్, సమీరా భరద్వాజ్ ఆలపించారు. వేటూరి అందించిన సాహిత్యాన్ని, అలాగే ఇళయరాజా అందించిన ట్యూన్‌ను అలాగే కొనసాగించారు.
ఆశికా రంగనాథ్‌తో కల్యాణ్ కెమిస్ట్రీ
నందమూరి వారసులలో ఇటీవల కాలంలో ఎన్టీఆర్, బాలకృష్ణ పాటలను రీమిక్స్ చేసిన దాఖలు పెద్దగా లేవు. బాబాయ్ బాలకృష్ణ పాటను అబ్బాయి కల్యాణ్ రామ్ తనదైన శైలిలో మెప్పించేందుకు ప్రయత్నించారు. ఆశికా రంగనాథ్‌తో కల్యాణ్ కెమిస్ట్రీ బాగా ఆకట్టుకొన్నది. వెండితెరపై వీరిద్దరి రొమాన్స్‌కు అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

అమిగోస్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: నందమూరి కల్యాణ్ రామ్, అశికా రంగనాథ్, బ్రహ్మజీ, సప్తగిరి తదితరులు
రచన, దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్ం మైత్రీ మూవీ మేకర్స్
సీఈవో: చెర్నీ
మ్యూజిక్: జిబ్రాన్
డీవోపీ: సౌందర్ రాజన్ ఎస్
ఎడిటర్: తమ్మిరాజు
కొరియోగ్రాఫర్: శోభీమాస్టర్


Click it and Unblock the Notifications











