Bimbisara First Single: బింబిసార క్యారెక్టర్‌లో మరో కోణం.. అలాంటి పాటతో అదరగొట్టిన కాలభైరవ
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నుంచి రానున్న బింబిసార సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేసు. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 5న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక బింబిసార సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యే విధంగా ఒక పాటను విడుదల చేశారు. ఈశ్వరుడే అనే ఆ పాటను ఎమ్ఎమ్.కీరవాణి కుమారుడు అద్భుతంగా పాడాడు. భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్బుతమే జరిగేనే.. అంటూ అద్భుతమైన రచన తో శ్రీమణి ఎంతో అర్థవంతంగా ఈ పాటను రాశాడు.
భయంకరమైన ఒక బింబిసార రాజు మళ్ళీ ప్రస్తుత కాలంలోకి తిరిగి వస్తే.. అతని కారణంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది సినిమాలో మేయిన్ పాయింట్. ఇక కథను కనెక్ట్ చేసే ఎంతో కీలకమైన ఈ పాటను చిరంతన్ భట్ అద్భుతంగా కంపోజ్ చేశాడు. ఈ లిరికల్ పాటలో విజువల్స్ చూస్తే భయంకరమైన రాక్షస రాజుగా ఉన్న బింబిసారలో మరో కోణం ఉన్నట్లుగా హైలెట్ చేశారు. అతనికి మళ్ళీ జ్ఞానోదయం అయ్యే విధంగా ఈశ్వరుడు మాయ చేసినట్లు కూడా పాటలో అర్థవంతంగా తెలియజేశారు.

సాంగ్ అయితే మొత్తానికి సినిమాపై మరింత అంచనాలను క్రియేట్ చేసింది. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద కళ్యాణ్ రామ్ కు బింబిసార మూవీ భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అంధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ హోమ్ బ్యానర్ నందమూరి ఆర్ట్స్ పై హరి కృష్ణ K నిర్మించగా వశిష్ట్ డైరెక్ట్ చేశాడు. కొత్త దర్శకుడు అయినప్పటికీ అతను మంచి విజువల్స్ తో సినిమాను తెరపైకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని కూడా క్లారిటీ ఇచ్చేశారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











