twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తలైవి అప్డేట్.. ‘ఇలా ఇలా’ అంటూ కంగనా రచ్చ

    |

    తమిళనాట అమ్మగా కీర్తించబడిన మాజీ సీఎం, నటి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం తలైవి. జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన సంగతి తెలిసిందే. గత వారం కంగనా రనౌత్ బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన ట్రైలర్‌కు ఏ రేంజ్‌లో స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తలైవి నుంచి మరో అప్డేట్ వచ్చింది.

    విబ్రి మీడియాపై విష్ణు వర్దన్ ఇందూరి శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తోన్న ఈమూవీని విజయ్ తెరకెక్కించాడు. ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటించాడు. ఇక చిత్రానికి జీవి ప్రకాష్ అదిరిపోయే సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈమూవీ నుంచి మరో ఆసక్తికరమైన పోస్టర్ వచ్చింది. సినీ రంగంలో జయలలిత ఓ ఊపులో ఉన్న నాటి సంగతులను తెలిపేలా ఈ పోస్టర్ ఉంది.

    kangana ranaut thalaivi ilaa ilaa song on 2nd April

    జయలలిత సినీ రంగానికి సంబంధించిన విశేషాలను తెలిపే ఇలా ఇలా అనే పాటను ఏప్రిల్ 2న విడుదల చేయబోతోన్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇందులో కంగనా రనౌత్ తన అందాల ఓ రేంజ్‌లో ప్రదర్శించింది. మొత్తానికి ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక పాట విడుదలైతే ఇంకే రేంజ్‌లో ఉంటుందో చూడాలి. ప్యాన్ ఇండియన్ లెవెల్‌లో రాబోతోన్న ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

    English summary
    kangana ranaut thalaivi ilaa ilaa song on 2nd April..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X