పరవశించి పోయేలా 'గుణ 369' ఫస్ట్ సాంగ్.. కార్తికేయ కెమిస్ట్రీ అదుర్స్
ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ ఆడియన్స్ లో క్రేజ్ సంపాదించిన కార్తికేయ హీరోగా రానున్న కొత్త సినిమా 'గుణ 369'. కార్తికేయ కెరీర్‌లో మూడో ప్రాజెక్టుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. స్పిన్ట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చింతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
ఈ చిత్రంలో కార్తికేయ డిఫెరెంట్ లుక్‌లో దర్శనమీయనున్నాడు. ఇప్పటికే గుణ 369 టీజర్ తో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు. శుభం విశ్వనాథ్ నడిచిన లిరిక్స్‌పై ''తొలి పరిచయామా ఇది తొలి పరవశమా ఇది'' అంటూ సాగిపోతున్న ఈ పాట యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. చేతన్ భరధ్వాజ్ సమకూర్చిన మెలోడీ ట్యూన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. సింగర్ హరి చరణ్ ఆలపించిన ఈ పాట లో హీరోహీరోయిన్ల మధ్య షూట్ చేసిన సన్నివేశాలు హైలైట్ అవుతున్నాయి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిందనే ఫీలింగ్ కలిగించిందీ పాట.

లవ్, యాక్షన్, ఎమోషన్ అన్నీ సమపాళ్లలో ఉండేలా చిత్రీకరిస్తున్న ఈ చిత్రంలో హీరో కార్తికేయ గుణ క్యారెక్టర్‌లో కనిపించనుండగా, హీరోయిన్ అనఘా గీత క్యారెక్టర్‌లో ఆకట్టుకోనుంది. సాయి కుమార్, ఆదిత్య మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుకుంటున్న 'గుణ 369' అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఎక్స్ 100 తో యువత మనసు దోచుకున్న కార్తికేయపై ప్రేక్షకుల్లో భారీ హోప్స్ ఉన్నాయి. గుణ 369 సినిమా ద్వారా ఆయన మరో సక్సెస్ సాధించడం ఖాయం అంటున్నారు. కథలో కొత్తదనం, ఊహించని మలుపులతో గుణ 369 కథ ఆద్యంతం ఆకట్టుకుంటుందని అంటోంది చిత్రయూనిట్.


Click it and Unblock the Notifications











