గుణ 369 నుంచి మనసుకు హత్తుకునే పాట.. రియల్లీ ఫెంటాస్టిక్
Rx100, హిప్పీ సినిమాల తరువాత కార్తికేయ కెరీర్‌లో మూడో ప్రాజెక్టుగా రానున్న సినిమా 'గుణ 369'. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్పిన్ట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చింతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా కోసం కార్తికేయ డిఫెరెంట్ గా మేకోవర్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మనసుకిది గరళం అనే పాటను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
కాగా ఇప్పటికే గుణ 369 టీజర్, ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్‌లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా చిత్రంలోని మరో పాటను విడుదల చేసింది. ''మనసుకిది గరళం గరళం.. సెకనుకొక మరణం మరణం'' అంటూ సాగిపోతున్న ఈ పాట మనసును హత్తుకుంటోంది. హీరో హీరోయిన్ల మధ్య షూట్ చేసిన రొమాంటిక్ సీన్స్ యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. చేతన్ భరధ్వాజ్ అందించిన ట్యూన్స్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. సింగర్స్ శ్వేతా మోహన్, విజయ్ ఏసుదాస్ ఆలపించిన తీరు రియల్లీ ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు.

ఇక ఈ చిత్రంలో హీరో కార్తికేయ 'గుణ' క్యారెక్టర్‌లో కనిపించనుండగా, హీరోయిన్ అనఘా 'గీత' క్యారెక్టర్‌లో ఆకట్టుకోనుంది. సాయి కుమార్, ఆదిత్య మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుకుంటున్న 'గుణ 369' అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో భారీ హోప్స్ తెచ్చాయి. గుణ 369 సినిమా ద్వారా కార్తికేయ మరో సక్సెస్ సాధించడం ఖాయం అంటున్నారు మేకర్స్. కథలో కొత్తదనం, ఊహించని మలుపులతో గుణ 369 కథ ఆద్యంతం ఆకట్టుకుంటుందని చెబుతోంది చిత్రయూనిట్.


Click it and Unblock the Notifications











