బుజ్జి బుజ్జి బంగారం.. నీ యవ్వారం.. వెరీ ఇంట్రెస్టింగ్: గుణ 369 న్యూ సాంగ్

క్రేజీ స్టార్ కార్తికేయ హీరోగా రానున్న కొత్త సినిమా 'గుణ 369'. ఆర్ఎక్స్ 100, హిప్పీ సినిమాల తరువాత కార్తికేయ కెరీర్‌లో మూడో ప్రాజెక్టుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పిన్ట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చింతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

గుణ 369 లో గుణ పాత్ర పోషిస్తున్న కార్తికేయ.. డిఫెరెంట్ లుక్‌లో దర్శనమీయనున్నాడు. ఇప్పటికే గుణ 369 టీజర్‌, ఫస్ట్ సాంగ్‌తో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా చిత్రంలోని రెండో పాటతో మరింత అట్రాక్ట్ చేసింది. ''బుజ్జి బుజ్జి బంగారం.. నీ యవ్వారం..'' అంటూ సాగిపోతున్న ఈ పాట ఎంతో నాచురల్ గా ఉంది. హీరో హీరోయిన్ల నాచురల్ లుక్స్, లొకేషన్స్ యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సాంగ్‌లో చేతన్ భరధ్వాజ్ అందించిన ట్యూన్స్, అనంత శ్రీరామ్ లిరిక్స్ స్పెషల్ అట్రాక్షన్‌. సింగర్స్ నాకాష్ అజిజ్, దీప్తి పార్థసారథి ఆలపించిన ఈ పాట సినిమాపై హోప్స్ పెంచేసిందని చెప్పుకోవచ్చు.

Karthikeyas Guna 369 Second Song Released

చిత్రంలో హీరో కార్తికేయ గుణ క్యారెక్టర్‌లో కనిపించనుండగా, హీరోయిన్ అనఘా గీత క్యారెక్టర్‌లో ఆకట్టుకోనుంది. సాయి కుమార్, ఆదిత్య మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుకుంటున్న 'గుణ 369' అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హోప్స్ ఉన్నాయి. గుణ 369 సినిమా ద్వారా కార్తికేయ మరో సక్సెస్ సాధించడం ఖాయం అంటున్నారు మేకర్స్. కథలో కొత్తదనం, ఊహించని మలుపులతో గుణ 369 కథ ఆద్యంతం ఆకట్టుకుంటుందని చెబుతోంది చిత్రయూనిట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X