Bedurulanka 2012: 8 ఎకరాల రొయ్యల చెరువులో సాంగ్.. రొమాంటిక్ గా కార్తికేయ-నేహా శెట్టి

ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ గుమ్మకొండ. ఆ తర్వాత విడుదలైన RX100 సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ నటన, పాయల్ తో రొమాన్స్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఈ సినిమా తర్వాత కార్తికేయ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు. అయితే హీరోగానే కాకుండా విలన్ గా కూడా ఆకట్టుకున్నాడు కార్తికేయ. గతేడాది వలిమై చిత్రంలో విలన్ గా అబ్బురపరిచిన కార్తికేయ తాజాగా హీరోగా బెదురులంక 2012 సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు.

RX100 సినిమాతో కార్తికేయ.. డీజే టిల్లు మూవీతో నేహా శెట్టి తెలుగులో యమ క్రేజ్ సంపాదించుకున్నారు. తొలిసారిగా వీరిద్దరు జంటగా నటిస్తున్న చిత్రం బెదురులంక 2012 (Bedurulanka 2012). లౌక్య ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై ముప్పానేని రవీంద్ర బెనర్జీ (బెన్నీ) నిర్మిస్తున్న ఈ సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సి. యువరాజ్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి వెన్నెల్లో ఆడపిల్ల అనే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు.

Kartikeya Neha Shetty Vennello Adapilla Song Out From Bedurulanka 2012

మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ వెన్నెల్లో ఆడపిల్ల అనే పాటకు యువ రచయతి కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించారు. హారిక నారాయణ్, జేవీ సుధాంశు ఆలపించగా.. కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాటకు వస్తున్న స్పందనపై నిర్మాత బెన్నీ ముప్పానేని సంతోషం వ్యక్తం చేశారు. "మణిశర్మ గారు అందమైన పాట ఇచ్చారు. ఇది మొత్తం ప్రేమకథకే కీలకం కానుంది.

మణిశర్మ సంగీతంతోపాటు కార్తికేయ, నేహా శెట్టి కెమిస్ట్రీ, కెమెరా వర్క్ హైలెట్ అవుతాయి. ఈ పాటను గోదావరి గ్రామంలోని 8 ఎకరాల రొయ్యల చెరువులో మధ్య రాత్రి వేళల్లో చిత్రీకరించాం. సినిమాలో హీరోహీరోయిన్ల రొమాన్స్, కామెడీ హైలెట్ కానుంది. నేను కచ్చితంగా చెప్పగలను ఈ సినిమా గోదావరి ఆధారిత రూరల్ డ్రామాల్లో బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది" అని నిర్మాత బెన్నీ తెలిపారు.

Kartikeya Neha Shetty Vennello Adapilla Song Out From Bedurulanka 2012

ఇంకా నిర్మాత మాట్లాడుతూ.. "ఈ సీజన్ కు ఎంటర్టైన్ మెంట్ చిత్రమని గర్వంగా చెబుతాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తాం. డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి" అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బెదురులంక 2012 సినిమాలో హీరోహీరోయిన్లతోపాటు అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, అటో రామ్ ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, సత్య, అనితా నాథ్, దివ్య నార్ని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X