Bheemla Nayak పవర్ స్టార్‌కు పాటను రాయలేనా?.. కానీ ఈ రోజు ఇలా అంటూ కాసర్ల శ్యామ్ ఎమోషనల్

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. పవన్ కల్యాణ్, కేటీఆర్, రానా దగ్గుబాటి ఒకేసారి వేదిక మీదకు వచ్చారు. దాంతో అభిమానుల ఆనందం హోరెత్తింది. ఈ వేడుకలో సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ..

భీమ్లా నాయక్ వేదిక మీద నిలబడాలని కోరిక ఎప్పుడో మొదలైంది. తమ్ముడు సినిమా బీహెచ్‌ఈఎల్‌లో షూటింగ్ జరిగినప్పుడు అక్కడికి వెళ్లాను. అలాగే జానీ సినిమా కోసం నేను చదివిన తెలుగు యూనివర్సిటీ టీమ్ పనిచేసినప్పుడు నా స్నేహితులు ఓ మాట చెప్పారు. పవన్ కల్యాణ్‌కు మట్టిపరిమళం అంటే ఇష్టం. జానపదాలు మీరి ఇష్టమని అంటే.. నాకు పిలుపు వస్తుందని ఆశపడ్డాను. అయితే నేను సినిమాల్లో నటించను.. రాజకీయాల్లోకి వెళ్తున్నాని చెప్పినప్పుడు.. ఇక నేను పవర్ స్టార్‌కు పాటను రాయలేనా అనే బాధ కలిగింది. ఆ క్షణం తర్వాత ఇప్పుడు ఈ విధంగా అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది అని కాసర్త శ్యామ్ అన్నారు.

Kasarla Shyam emotional Speech at Bheemla Nayak pre release event

కానీ మనిషికి పంచ ప్రాణాలే ఉంటాయి. కానీ పవన్ కల్యాణ్ కోసం కోట్లాది ప్రాణాలు ఉన్నాయి. మన అభిమానులందరూ గర్వంగా చెప్పుకొనే క్షణాలు ఇవి. ఈ సినిమా కోసం ఏం రాశావని అడిగితే.. ఇంకా నేను రాసిన పాటలు ఇంకా రిలీజ్ కాలేదు. ఈ రోజు ఇదే వేదికపై రిలీజ్ చేస్తారు. మరో పాట తెరమీదే సందర్భోచితంగా వస్తుంది అంటూ కాసర్ల శ్యామ్ చెప్పారు.

నా కవి హృదయాన్ని బయటపెట్టే అవకాశాన్ని సంగీత దర్శకుడు తమన్ అవకాశం ఇచ్చాడు. దర్శకుడు సాగర్ కే చంద్ర తీసిన అప్పట్లో ఒకడుండే వాడు సినిమాకు పనిచేశాను. ఈ సినిమాలో నేను రాసిన పాట వినిపిస్తాను అంటూ.. దుమ్ము దుమ్ము తొండన అంటూ ఓ పాటను పాడారు. ఈ పాటను రాసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ కాసర్ల శ్యామ్ ఎమోషనల్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X