జన్మ ధన్యమైంది.. లిరిక్ రైటర్ ఎమోషనల్ ట్వీట్
తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీతానికి, పాటలకు, పాటల రచయితకు తగిన గౌరవం, గుర్తింపు దక్కుతున్నట్టు కనిపిస్తోంది. అల వైకుంఠపురములో మూవీ అంతటి ఘన విజయం సాధించడం వెనుకున్న పాటలు, సాహిత్యపు కృషిని త్రివిక్రమ్ చెబుతూ.. పాటల రచయితలతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.
ఈ మధ్య కాలంలో సాంగ్స్‌కు, లిరిక్ రైటర్స్‌కు అంతటి గుర్తింపును తీసుకొచ్చిన చిత్రం మరొకటి లేదు. అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాముల పాటను రాసిన కాసర్ల శ్యామ్ గురించి ప్రస్తుతం అందరికీ తెలిసిందే. అంతకు మందు ఛల్ మోహనరంగ సినిమాలో బంబాట్ అనే మాస్ సాంగ్ రాయడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

తాజాగా భీష్మ సినిమాలో వాట్టే బ్యూటీ అనే పాటన రాయగా అది కూడా సూపర్ హిట్ అయింది. తెలంగాణ మాండలీకంలో కాసర్ల శ్యామ్ వాడే పద ప్రయోగాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. తాజాగా రంగమార్తాండ మూవీ కోసం ఇళయరాజా సారథ్యంలో ఓ పాటను రాయబోతోన్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ.. జన్మ ధన్యమైందని ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











