'ఆర్ఆర్ఆర్' సంగీతం ఎలా ఉంటుందో చెప్పిన కీరవాణి!
దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి దశాబ్దాలుగా తెలుగు సినీ అభిమానులని అలరిస్తున్నారు. కీరవాణి సంగీతం అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించే విధంగా ఉంటుంది. అందుకే ఆయన ఇంతకాలం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. కీరవాణి సంగీతం అందించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ తదుపరి చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రాజమౌళి సినిమా అంటే అనుమానం లేకుండా కీరవాణే సంగీత దర్శకుడు. రాజమౌళి, కీరవాణి సోదరులే కావడంతో వీరి మధ్య సమన్వయం బాగా కుదిరింది. ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి కీరవాణి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అలాగే పీరియడ్ డ్రామాకు అవసరమైన సంగీతం రెండు మిళితమై ఉంటాయని వెల్లడించారు.

కీరవాణి మాటల బట్టి ఆర్ఆర్ఆర్ చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోందనే విషయం ఖరారైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రంలో కలసి నటిస్తున్న సంగతి తేలింది. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందు రానుంది.


Click it and Unblock the Notifications











