RRR అప్డేట్.. కీరవాణి మొదలుపెట్టాడు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న క్రేజీ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత మరో అద్భుతానికి శ్రీకారం చుట్టారు. సౌత్ ఇండియాలోనే భారీ మల్టీస్టారర్ చిత్రంగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలిని మించేలా ఉండడానికి రాజమౌళి పెద్ద కసరత్తే చేస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ లుక్స్ డిఫెరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.
కానీ ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల విషయంలో సందిగ్దత కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర సంగీతానికి సంబంధించిన వర్క్ ప్రారంభమై పోయింది. ఎప్పటిలాగే ఈ రాజమౌళి చిత్రానికి కూడా కీరవాణే సంగీతం అందిస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్లు కీరవాణి తాజాగా ప్రకటించారు.

రాజమౌళి, కీరవాణి మధ్య సమన్వయం అద్భుతంగా ఉంటుంది. అందువలనే వీరి చిత్రాల్లో సంగీతం బాగా వస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్రం ఫ్రీడమ్ ఫైట్ నేపథ్యంలో తెరకెక్కుతుండడంతో కీరవాణి ఎలాంటి సంగీతం అందిస్తాడో అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. త్వరలో ఈ ఆర్ఆర్ఆర్చిత్ర యూనిట్ కోల్‌కతాలో లాంగ్ షెడ్యూల్ కోసం సిద్ధం అవుతున్నారు.


Click it and Unblock the Notifications











