తల్లి ప్రేమకు ప్రతిరూపంగా.. కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ ఫస్ట్ సింగిల్ వైరల్
మహానటి సినిమాతో కీర్తి సురేష్ స్థాయి పెరిగిపోయింది. ఎలా పడితే అలా కనిపించకపోవడం, కథ-కథనాలతో సంబంధం లేని సినిమాల జోలికి వెళ్లకపోవడం కీర్తి సురేష్ అందరిలోనూ భిన్నంగా ఉండేలాచేసింది. డబ్బు కోసం హద్దులు దాటి నటించడం, బికినీ ధరించడం వంటి వాటికి దూరంగా ఉండటమే కీర్తి సురేష్ క్రేజ్‌కు కారణం. కీర్తి సినిమా వస్తుందంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని అందరూ ఆశిస్తారు. మహానటి తరువాత తెలుగులో ఏ చిత్రాన్ని చేయలేదు. అయితే ఇంకో మూడు రోజుల్లో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు కీర్తి సురేష్ వచ్చేస్తోంది.
ప్రస్తుతం థియేటర్స్ ప్రారంభం అయ్యే సూచనలు కనిపించకపోవడంతో కొందరు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా, స్టార్ సినిమా పెంగ్విన్. కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజు నిర్మిస్తుండగా.. ఈశ్వర్ కార్తిక్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని నేరుగా ఆన్‌లైన్‌లోనే విడుదల చేసేందుకు అంతా సిద్దమైంది. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ కూడా అందర్నీ ఆకట్టుకుంటోంది.

ప్రాణమే అంటూ సాగే ఈ పాట పిల్లల కోసం తల్లి పడుతున్న వేదనను చక్కగా ఆవిష్కరించింది. మాతృ ప్రేమకు ప్రతిరూపంగా ఈ పాట సాగింది. ఈ పాటను ఒరిజినల్‌గా వివేక్ రచించగా.. వెన్నెల కంటి తెలుగు సాహిత్యాన్ని సమకూర్చాడు. సుష గాత్రం ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చింది. సంతోష్ నారాయణ్ అందించిన బాణిలో ఓ మంచి ఫీల్ ఉంది. ఈ సినిమాను జూన్ 19న నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు.


Click it and Unblock the Notifications











