Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
KGF: Chapter 2 రిలీజ్‌కు ముందే చరిత్ర.. దక్షిణాది ఇండస్ట్రీలోనే రికార్డు ధరకు మ్యూజిక్ రైట్స్
చలన చిత్ర ఆడియో రంగంలో ప్రముఖ సంస్థ లహరి టీ సిరీస్ మరోసారి వార్తల్లో నిలిచింది. దేశవ్యాప్తంగా ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న కేజీఎఫ్: చాప్టర్ 2 చిత్రం ఆడియో హక్కులను భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకొన్నది. అయితే దక్షిణాది చిత్ర పరిశ్రమలో ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి రేటుకు ఈ హక్కులను దక్కించుకోవడం చర్చనీయాంశమైంది. కేజీఎఫ్2 ఆడియో హక్కులు ఎంతకు అమ్ముడుపోయాయంటే..
దక్షిణాదిలో టాప్ మ్యూజిక్ రైట్స్
దక్షిణాదిలో ఇప్పటి వరకు రజనీకాంత్ నటించిన 2.0 చిత్రానికి సంబంధించిన ఆడియో హక్కుల రేటు రికార్డుగా నిలిచింది. ఆ చిత్రం మ్యూజిక్ రైట్స్ రూ.5.2 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక ఆ తర్వాత మాస్టర్ మ్యూజిక్ హక్కులు రూ.4.5 కోట్లు, ఆచార్య చిత్రం రూ.4 కోట్లు, కేజీఎఫ్ చాఫ్టర్ 1 హక్కులు రూ.3.6 కోట్లకు అమ్ముడుపోయాయి.
పొట్టిగౌనులో అనసూయ హాట్ ఫోటో షూట్.. అదిరే అందాలతో హొయలు పోతూ!
ఫ్యాన్సీ రేటుకు కేజీఎఫ్2 హక్కులు
ఇక కేజీఎఫ్1 భారీ సక్సెస్ తర్వాత దానికి సీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్: ఛాప్టర్ 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ సుమారు రూ.7.2 కోట్లకు అమ్ముడుపోయినట్టు అనధికారికంగా వెల్లడైంది. ఈ రేంజ్లో ధరను చెల్లించి హక్కులు పొందడం సెన్సేషన్‌గా మారింది.
గట్టి పోటీ మధ్య లహరి సంస్థకు
కేజీఎఫ్ 2 మ్యూజిక్ రైట్స్ కొనుగోలు విషయంపై లహరి టీ సీరిస్ ఆడియో సంస్థ స్పందించింది. ఆ సంస్థ సీఈవో మనోహర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. కేజీఎఫ్2 ఆడియో హక్కులను సొంతం చేసుకొన్న వార్త నిజమే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో మేము భారీ ప్రయత్నాలు చేశాం. గట్టి పోటీ మధ్య ఫ్యాన్సీ రేటును చెల్లించి ఈ హక్కులను కంపెనీ దక్కించుకొన్నది అని ఆయన తెలిపారు.
కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ ఎప్పుడంటే...
కరోనావైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేజీఎఫ్ 2 చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రాన్ని జూలై రెండోవారంలో రిలీజ్ చేయాలని అనుకొన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యం అయ్యేటట్టు కనిపిస్తున్నది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయాలని అనుకొంటన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.