twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF: Chapter 2 రిలీజ్‌కు ముందే చరిత్ర.. దక్షిణాది ఇండస్ట్రీలోనే రికార్డు ధరకు మ్యూజిక్ రైట్స్

    |

    చలన చిత్ర ఆడియో రంగంలో ప్రముఖ సంస్థ లహరి టీ సిరీస్ మరోసారి వార్తల్లో నిలిచింది. దేశవ్యాప్తంగా ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న కేజీఎఫ్: చాప్టర్ 2 చిత్రం ఆడియో హక్కులను భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకొన్నది. అయితే దక్షిణాది చిత్ర పరిశ్రమలో ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి రేటుకు ఈ హక్కులను దక్కించుకోవడం చర్చనీయాంశమైంది. కేజీఎఫ్2 ఆడియో హక్కులు ఎంతకు అమ్ముడుపోయాయంటే..

    దక్షిణాదిలో టాప్ మ్యూజిక్ రైట్స్

    దక్షిణాదిలో టాప్ మ్యూజిక్ రైట్స్

    దక్షిణాదిలో ఇప్పటి వరకు రజనీకాంత్ నటించిన 2.0 చిత్రానికి సంబంధించిన ఆడియో హక్కుల రేటు రికార్డుగా నిలిచింది. ఆ చిత్రం మ్యూజిక్ రైట్స్ రూ.5.2 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక ఆ తర్వాత మాస్టర్ మ్యూజిక్ హక్కులు రూ.4.5 కోట్లు, ఆచార్య చిత్రం రూ.4 కోట్లు, కేజీఎఫ్ చాఫ్టర్ 1 హక్కులు రూ.3.6 కోట్లకు అమ్ముడుపోయాయి.

    పొట్టిగౌనులో అనసూయ హాట్ ఫోటో షూట్.. అదిరే అందాలతో హొయలు పోతూ!పొట్టిగౌనులో అనసూయ హాట్ ఫోటో షూట్.. అదిరే అందాలతో హొయలు పోతూ!

    ఫ్యాన్సీ రేటుకు కేజీఎఫ్2 హక్కులు

    ఫ్యాన్సీ రేటుకు కేజీఎఫ్2 హక్కులు

    ఇక కేజీఎఫ్1 భారీ సక్సెస్ తర్వాత దానికి సీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్: ఛాప్టర్ 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ సుమారు రూ.7.2 కోట్లకు అమ్ముడుపోయినట్టు అనధికారికంగా వెల్లడైంది. ఈ రేంజ్‌లో ధరను చెల్లించి హక్కులు పొందడం సెన్సేషన్‌గా మారింది.

    గట్టి పోటీ మధ్య లహరి సంస్థకు

    గట్టి పోటీ మధ్య లహరి సంస్థకు

    కేజీఎఫ్ 2 మ్యూజిక్ రైట్స్ కొనుగోలు విషయంపై లహరి టీ సీరిస్ ఆడియో సంస్థ స్పందించింది. ఆ సంస్థ సీఈవో మనోహర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. కేజీఎఫ్2 ఆడియో హక్కులను సొంతం చేసుకొన్న వార్త నిజమే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో మేము భారీ ప్రయత్నాలు చేశాం. గట్టి పోటీ మధ్య ఫ్యాన్సీ రేటును చెల్లించి ఈ హక్కులను కంపెనీ దక్కించుకొన్నది అని ఆయన తెలిపారు.

    కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ ఎప్పుడంటే...

    కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ ఎప్పుడంటే...

    కరోనావైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేజీఎఫ్ 2 చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రాన్ని జూలై రెండోవారంలో రిలీజ్ చేయాలని అనుకొన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యం అయ్యేటట్టు కనిపిస్తున్నది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయాలని అనుకొంటన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    English summary
    Kannada Super Star Yash's KGF: Chapter 2 Music Rights sold for huge amount. Popular music company Lahari T Series has captured for fancy rate by paying 7 crores. This deal is highest in south film Industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X