KGF Chapter 2: కేజీఎఫ్ మరో సెన్సేషనల్ రికార్డు.. తుఫాన్ దెబ్బకు 5 కోట్లు ఫినీష్
కొంత కాలంగా దక్షిణ భారతదేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు వస్తున్నాయి. ఇప్పటికే ఇలా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. వాటిలో ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకున్నాయి. అలా కొన్నేళ్ల క్రితం కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. శాండిల్‌వుడ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లోనూ భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. దీంతో కలెక్షన్లు పోటెత్తడంతో పాటు ఎన్నో అవార్డులు కూడా ఈ మూవీ సొంతం అయ్యాయి.
'కేజీఎఫ్ చాప్టర్ 1' ఇండియన్ బాక్సాఫీస్‌పై ఎంతటి ప్రభావాన్ని చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఇందులో యశ్‌కు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా పడిపోయారు. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను తీయాలని యూనిట్ అప్పుడే ఫిక్స్ అయింది. అందుకు అనుగుణంగానే వెంటనే ప్రకటనను వదలడంతో పాటు షూటింగ్‌ను కూడా షురూ చేసేసింది. అలా సుదీర్ఘ కాలం పాటు చిత్రీకరణ జరుపుకున్న తర్వాత అంటే గత ఏడాది చివర్లో ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం కంప్లీట్ చేసి విడుదలకు సిద్ధం చేసుకున్నారు.
మొదటి భాగంలో రాఖీ భాయ్ కేజీఎఫ్‌ను తన వశం చేసుకోవడంతో కథ ముగుస్తుంది. ఇక, ఇప్పుడు అధీరా రూపంలో అతడికి ప్రధాన ప్రత్యర్థి రావడంతో 'కేజీఎఫ్ చాప్టర్ 2' కథ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి పోరాటం జరిగింది అనే నేపథ్యంతో దీన్ని రూపొందించారు. ఇందులో రాఖీ భాయ్ హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేసి చూపిస్తారట. ఇక, ఈ సినిమాను 2022, ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఎప్పుడో అధికారికంగా ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్‌ను కూడా భారీ స్థాయిలో పూర్తి చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు.

భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ విడుదలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం నుంచి 'తుఫాన్' అంటూ సాగే ఓ పాటను విడుదల చేశారు. ఈ పాటను రవి బస్రూర్ కంపోజ్ చేశారు. తెలుగులో దీన్ని శ్రీ కృష్ణ, పృద్వి చంద్ర, అరుణ్ కౌండిన్య వంటి వాళ్లు ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ఇచ్చారు. ఇందులో రాఖీ భాయ్ డాన్‌గా ఎదిగిన తీరును చూపించారు. అతడి ఎలివేషన్స్ ఈ పాటలో అదిరిపోయేలా డిజైన్ చేశారు. దీంతో ఈ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా అన్ని భాషల్లో కలిపి ఇది యాభై మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుని సత్తా చాటింది.
తాజాగా విడుదలైన 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ ట్రైలర్ నేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే, ఇప్పుడు తుఫాన్ సాంగ్‌తో ఇది మరో సెన్సేషనల్ రికార్డును సొంతం చేసుకుంది. ఇక, ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. వీళ్లతో పాటు పలు పరిశ్రమలకు చెందిన ఎంతో మంది నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











