Toofan Lyrical: రాఖీ భాయ్ తుఫాన్ మొదలైంది.. ఆ ఎలివేషన్ ఏంటి సామీ!

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో దక్షిణాది సినిమాల స్థాయి అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది. మన ప్రాంతీయ భాషా చిత్రాలను ఉత్తరాది ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మరీ ముఖ్యంగా 'బాహుబలి' సినిమా వచ్చిన తర్వాత సౌత్ మూవీలపై ఆసక్తి పెరిగిపోయింది. దీంతో అప్పటి నుంచి భారీ చిత్రాలు ఎన్నో వస్తున్నాయి. అలా రెండేళ్ల క్రితం వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన మూవీనే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించాడు. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. బాలీవుడ్‌లోనూ తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. దీంతో అవార్డులూ దక్కాయి.

'కేజీఎఫ్ చాప్టర్ 1' భారీ కలెక్షన్లతో ఎన్నో చెరిగిపోని రికార్డులను క్రియేట్ చేసింది. మరీ ముఖ్యంగా ఇందులో యశ్‌కు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను తీయాలని యూనిట్ ఫిక్స్ అయింది. అందుకు అనుగుణంగానే వెంటనే ప్రకటనను వదలడంతో పాటు షూటింగ్‌ను కూడా షురూ చేసేసింది. అలా సుదీర్ఘ కాలం పాటు చిత్రీకరణ జరుపుకున్న తర్వాత అంటే గత ఏడాది చివర్లో ఈ సినిమా టాకీ పార్టును విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం కంప్లీట్ చేసేశారు.

KGF Chapter 2 Toofan Lyrical Video Released

మొదటి భాగంలో కేజీఎఫ్ మొత్తాన్ని తన వశం చేసుకున్న రాఖీ భాయ్‌కు అధీరా రూపంలో ప్రధాన ప్రత్యర్థి రావడంతో 'కేజీఎఫ్ చాప్టర్ 2' కథ ప్రారంభం అవుతుంది. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి పోరాటం జరిగింది అనే నేపథ్యంతో దీన్ని రూపొందించారు. ఇందులో రాఖీ భాయ్ హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేసి చూపించబోతున్నారు. ఇక, ఈ సినిమాను 2022, ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్‌ను కూడా భారీ స్థాయిలో జరుపుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో.. అఫీషియల్ ట్రైలర్‌ను మార్చి 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇక, ఇప్పుడు దీని నుంచి మొదటి పాటను కూడా రిలీజ్ చేశారు. 'తుఫాన్' అంటూ సాగే ఈ పాటను రవి బస్రూర్ కంపోజ్ చేశారు. తెలుగులో దీన్ని శ్రీ కృష్ణ, పృద్వి చంద్ర, అరుణ్ కౌండిన్య వంటి వాళ్లు ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ఇచ్చారు. ఇక, ఇందులో రాఖీ భాయ్ డాన్‌గా ఎదిగిన తీరును చూపించారు. అతడి ఎలివేషన్స్ ఈ పాటలో అదిరిపోయేలా డిజైన్ చేశారు. దీంతో ఈ సాంగ్ ట్రెండింగ్ అవుతోంది.

కొద్ది రోజుల క్రితమే విడుదలైన 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ టీజర్ నేషనల్ రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక, ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. వీళ్లతో పాటు పలు పరిశ్రమలకు చెందిన ఎంతో మంది నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X