twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Michael Jackson Death Anniversary మైఖేల్ జాక్సన్‌ స్పూర్తితో సూపర్ స్టార్స్..మెగాస్టార్స్ అయిన వారెవరో తెలుసా?

    |

    సంగీత ప్రపంచాన్ని, పాప్ వరల్డ్‌ను తన పాటలు, డ్యాన్సులతో కిక్కెక్కించిన మైఖేల్ జాక్సన్ తిరిగి రాని లోకాలకు వెళ్లి13 ఏళ్లు అవుతున్నది. ఆయన 2009లో శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం సంగీత అభిమానులను తీవ్ర విషాదంలో ముంచింది. అయితే ఇప్పటికీ మైఖేల్ జాక్సన్ లేని లోటు ఎవ్వరూ కూడా తీర్చలేనిదనే విషయం తెలిసిందే. అయితే కింగ్ ఆఫ్ పాప్‌గా పేరు తెచ్చుకొన్న ఈ సంగీత కారుడి వర్ధంతిని సందర్భంగా ఆయన మ్యూజిక్‌ను అభిమానులు గుర్తు చేసుకొంటున్నారు.

    మైఖేల్ జాక్సన్ ఆగస్టు 29, 1958లో జన్మించాడు. గాయకుడిగా, గేయ రచయితగా, డ్యాన్సర్‌గా రకరకాల భూమికలు పోషించాడు. జూన్ 25వ తేదీ 2009లో గుండెపోటుతో మరణించాడు. మితీమిరి ట్యాబ్లెట్లు, మెడిసిన్ తీసుకోవడం వల్ల ఆయన మరణించారనే విషయం స్పష్టమైంది.

    ఆయన డ్యాన్స్ స్టయిల్స్, మూన్ వాక్, పాటలు ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. అంటే ఆయన ప్రభావం నేటి తరం మీద కూడా ఎలా ఉందో స్పష్టంగా తెలియజేస్తున్నది. లెబెల్ డిస్ప్యూట్, ఇవిన్సిబుల్, డేంజరస్, బ్యాడ్, థ్రిల్లర్, మోటౌన్ లాంటి ఆల్బమ్స్ ఎన్నో ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి.

    King of Pop Michael Jackson Death Anniversary: Here is details of greatest musician legend

    భారతీయ సినిమా ప్రముఖులపై మైఖేల్ జాక్సన్‌ ప్రభావం భారీగానే ఉంది. ఆయన స్పూర్తితో చిరంజీవి, ప్రభుదేవా, గోవిందా, హృతిక్ రోషన్, జావెద్ జాఫ్రీ లాంటి వాళ్లు గొప్ప డ్యాన్సర్లుగా వెండితెరపై రాణించారు.

    మైఖేల్ జాక్సన్ వర్ధంతి సందర్భంగా ఆయన ప్రతిభను, మ్యూజిక్‌ను గుర్తు చేసుకొంటూ అభిమానులు వందనాలు సమర్పిస్తున్నారు.

    English summary
    Music lovers celebrating King of pop Michael Jackson's on June 25th. Here is the details of greast music legend.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X