Kingdom: విజయ్ దేవరకొండ, భాగశ్రీ ఘాటుగా లిప్‌లాక్.. హృదయం లోపల అంటూ
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం కింగ్‌డమ్. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోర్సే హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మే 30వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా తొలి సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయగా మంచి స్పందన లభిస్తున్నది. ఈ సాంగ్ వివరాల్లోకి వెళితే..
కింగ్‌డమ్ సినిమా సాంగ్ ప్రోమో విషయానికి వస్తే.. సముద్రం ఒడ్డున హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోర్సే దీర్ఘాలోచనలో నుంచి బయటకు వచ్చి.. ఒకరి కళ్లలోకి మరొకరు ప్రేమగా చూసుకొంటారు. విజయ్‌ను తదేకంగా ఓ క్షణం పాటు చూసి పెదవిపై ముద్దు పెట్టేస్తుంది. ఆ తర్వాత ఆమెను విజయ్ చూస్తూ అలానే ఉండిపోతాడు. ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తూ.. తెలిసిపోయిందేమో అంటే.. అయితే ఆపొద్దు అంటూ మళ్లీ లిప్ లాక్ వేసేస్తారు. అప్పడే హృదయం లోపల అనే పాట ప్రోమోలో వినిపించారు.

ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలకు తగినట్టుగానే విజయ్ దేవరకొండ, గౌతమ్, అనిరుధ్ త్రయం నుంచి ఈ పాట ఉంది. రొమాంటిక్ సాంగ్‌గా విడుదలైన ఈ పాటకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. రిలీజైన కొద్ది సేపట్లోనే లక్షలాది వ్యూస్ సొంతం చేసుకొన్నది. ప్రేక్షకులు, సంగీత ప్రియుల అంచనాలను మించేందుకు చేసిన ప్రయత్నం ఈ పాటలో కనిపించింది.
హృదయం లోపల పాటలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోర్సే జంట తెరపైన ప్రామిసింగ్‌గా కనిపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సహజంగా, జెన్యూన్‌గా ఉందనిపించింది. ప్రేమికులంటే ఇలా ఉండాలనే విధంగా గౌతమ్ తిన్ననూరి ఇద్దరి పాత్రలను క్రియేట్ చేశాడా? అనే ఫీలింగ్ కలిగించింది. ఈ పాట పూర్తిగా మే 2వ తేదీన విడుదల కానుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
కింగ్‌డమ్ సినిమా కాన్సెప్ట్‌ను బలంగా చెప్పేందుకు ప్రొడక్షన్ హౌస్ ప్రయత్నిస్తున్నది. వారు బతకడానికి ప్రేమను నటిస్తారు. కానీ త్వరలోనే అది నిజమనిపిస్తుంది అనే విషయాన్ని నిర్మాతలు వెల్లడించారు. ప్రధాన పాత్రలు తొలుత ప్రేమను నటిస్తాయి. కానీ చివరకు ఆ పాత్రలు ప్రేమలో పడిపోతాయనే విషయాన్ని చెప్పకనే పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
సముద్ర తీరం, హోరుగాలులు, మనసును ఆహ్లాద పరిచే వాతావరణంలో ఈ పాటను షూట్ చేశారు. ఈ సినిమాకు జోమోన్ టీ జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు పాపులర్ ఎడిటర్ నవీన్ నూలి పనిచేస్తున్నారు. ప్రోమోలో అనిరుధ్ సంగీతం కట్టిపడేసింది.
ఇదిలా ఉంటే.. హృదయం లోపల అంటూ అనిరుధ్, అనుమిత నదేశన్ తమదైన గాత్రంతో మెప్పించారు. ఈ మనోహరమైన గీతానికి రచయిత కేకే సాహిత్యం అందించారు. దార్ గై తన కొరియోగ్రఫీతో ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారనే ఫీలింగ్ కల్పించారు. పూర్తి పాట రిలీజ్ తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











