డీజే టిల్లు భామతో కిరణ్ అబ్బవరం లవ్ ట్రాక్.. నీలోనే నేను ఉన్నాను అంటున్న రూల్స్ రంజన్
టాలీవుడ్‌లో హిట్టు, ఫ్లాప్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్న యువ హీరో కిరణ్ అబ్బవరం. రాజా వారు రాణిగారు, ఎస్ఆర్ కల్యాణ మండపం, వినరో భాగ్యం విష్ణు కథ చిత్రాల విజయంతో తనకంటూ ఒక మార్కెట్‌ను క్రియేట్ చేసుకొన్నారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం రూల్స్ రంజన్. డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. నీ మనసు నాకు తెలుసు.
ఆక్సిజన్ చిత్రాలకు రచయితగా పనిచేసిన రత్నం కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దివ్యాంగ్ లావణ్య, మురళీ కృష్ణ వేమూరి నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే జూలై విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా లవ్ ట్రాక్‌తో సాగిన పాటను విడుదల చేశారు. ఈ సినిమాలోని పాట గురించిన వివరాల్లోకి వెళితే..

నేహా శెట్టి, కిరణ్ అబ్బవరం మధ్య డ్యూయెట్‌గా రూపొందించిన నాలో నేనే లేను.. నీలోనే ఉన్నాను.. ఊహల్లోనా లేను. పిల్ల ఊసులే ఉన్నాను అనే పాటను రాంబాబు గోసల రాయగా.. శరత్ సంతోష్ ఆలపించారు.ఈ పాటకు అమ్రీష్ సంగీతాన్ని అందించారు. ఫీల్ గుడ్ పాటగా రూపొందిన ఈ పాట క్యాచీగా, సంగీత ప్రియులను ఆకట్టుకొంటున్నది.
రచయిత రాంబాబు గోసాల మాట్లాడుతూ.. రూల్స్ రంజన్ చిత్రంలో నాలో నేనే లేను అనే పాట రాసినందుకు చాలా సంతోషం, మా దర్శకులు రత్నం కృష్ణ గారు చాలా మంచి సందర్భాన్ని నాకు వివరించారు. 'నాలో నేనే లేను నీలోనే ఉన్నాను' అంటూ మొదలయ్యి నేను ఊహల్లో లేను ఎప్పుడూ నీ ఊసుల్లోనే ఉంటున్నాను నువ్వు ఏం మాయ చేసావు నీ రూపం ఒక మాయ నువ్వే ఒక మాయ నాకు నిద్ర పట్టట్లేదు కానీ చాలా హాయిగా ఉంది ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేదు అనుకుంటూ తన ఫీలింగ్స్ ని చెప్పుకునే పాట.
చాలా అందమైన బాణీకి చాలా మంచి తేలిగ్గా పాడుకునేటట్లుగా ఉండే పదాలతో పాటని రాయమని చెప్పారు. ఈ పాట పెద్ద హిట్ అవుతుందని అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.
నటీనటులు: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, నెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చూర్, విజయ్ పాట్కర్, మక్రంద్ దేశ్ పాండే, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్ తదితరులు
నిర్మాతలు: దివ్యాంగ్ లావణ్య, మురళీ కృష్ణ వేమూరి
సహ నిర్మాత: రింకూ కుక్రేజా
దర్శకత్వం, రచన: రత్నం కృష్ణ
సినిమాటోగ్రఫి: దులీప్ కుమార్ ఎంఎస్
ఆర్ట్: సుధీర్ మాచర్ల
పీఆర్వో: లక్ష్మీ వేణుగోపాల్


Click it and Unblock the Notifications











