నచ్చావ్ అబ్బాయి అంటూ కేక పెట్టించిన కిరణ్ అబ్బవరం.. నేను మీకు బాగా కావాల్సినవాడిని పాట ట్రెండింగ్‌గా
విభిన్నమైన నటన, విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న యువ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. SR కళ్యాణమండపం లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారి రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణమండపం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ఈ చిత్రంలో విభిన్నంగా పక్కా కమర్షియల్‌గా కనిపించబోతున్నారు. విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నచ్చావ్ అబ్బాయి అనే పాటను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు.

నేను మీకు బాగా కావాల్సిన వాడిని చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఈ చిత్రం నుండి ఒక మాస్ బీట్‌ను రిలీజ్ చేసారు.
నచ్చావ్ అబ్బాయి పాటలో కిరణ్ అబ్బవరం వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని లహరి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వచ్చారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా విడుదలకు సిద్దమైంది. కిరణ్ అబ్బవరం మాస్ లుక్‌లో అందర్ని ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలను త్వరలోనే దర్శక నిర్మాతలు తెలియజేస్తామని చెప్పారు.
నటీనటులు: కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్, సమీర్, సంగీత, నిహరిక, ప్రమోదిని, భరత్ రొంగలి తదితరులు
ప్రోడ్యూసర్: కోడి దివ్య దీప్తి
డైరక్టర్: శ్రీధర్ గాదె (SR కళ్యాణమండపం ఫేమ్)
సమర్పణ: కోడి రామకృష్ణ
కో-ప్రోడ్యూసర్: నరేష్ రెడ్ది మూలే
సినిమాటోగ్రఫి: రాజ్ నల్లి
సంగీతం: మణిశర్మ
బ్యానర్: కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్
లిరిక్స్: భాస్కర్ భట్ల
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్ డైరక్టర్: ఉపేంద్ర రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భరత్ రొంగలి
పీఆర్వో: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్


Click it and Unblock the Notifications











