Dhekho Mumbai Song: మరోసారి కిరణ్ అబ్బవరం మ్యాజిక్.. రూల్స్ రంజన్‌కు హిట్ కళ
బ్యాగ్రౌండ్ లేకపోయినా ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది తెలుగు కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన టాలెంట్లతో విశేషమైన గుర్తింపును దక్కించుకుంటున్నారు. అందులో సహజసిద్ధమైన నటనతో మెప్పిస్తున్న కిరణ్ అబ్బవరం ఒకడు. 'రాజావారు రాణిగారు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. ఆ వెంటనే 'ఎస్ఆర్ కల్యాణమండం', 'వినరో భాగ్యము విష్ణు కథ' వంటి హిట్లతో సత్తా చాటాడు. ఈ ఊపులోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
కిరణ్ అబ్బవరం తాజాగా 'రూల్స్ రంజన్' అనే సినిమాను చేశాడు. రత్నం కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇప్పటికే దీని నుంచి టీజర్, ట్రైలర్‌తో పాటు కొన్ని పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. వాటన్నింటికీ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. ఫలితంగా ఈ చిత్రంపై ఉన్న అంచనాలు కూడా రెట్టింపు అయిపోయాయి. దీంతో మూవీ యూనిట్ మరింత జోష్‌తో ప్రచారాన్ని ముమ్మరం చేసేసింది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'రూల్స్ రంజన్' మూవీని అక్టోబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితమే అంటే సెప్టెంబర్ 19వ తేదీన ఈ మూవీ నుంచి 'దేఖో ముంబై' అంటూ సాగే ఓ జోష్‌ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అమ్రిష్ కంపోజ్ చేసిన ఈ పాటను అద్నాన్ సమీ, పాయల్ దేవ్ ఆలపించారు. దీనికి కాసర్ల శ్యామ్, మెగా వాట్ లిరిక్స్ రాశారు.

'రూల్స్ రంజన్' మూవీ నుంచి వచ్చిన 'దేఖో ముంబై' పాటకు అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి అదిరిపోయే స్పందన లభిస్తోంది. దీంతో ఈ సాంగ్ అప్పుడు 3 మిలియన్ల వరకూ వ్యూస్‌ను సైతం సొంతం చేసుకుంది. అంతేకాదు, రెండు రోజుల నుంచి యూట్యూబ్‌లో ఈ పాట టాప్ 10లో ట్రెండింగ్ అవుతోంది. ఇక, ఈ పాటను విన్న వాళ్లంతా కిరణ్ అబ్బవరం చిత్రానికి హిట్ కళ కనిపిస్తుంది అన్నట్లుగా చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. 'రూల్స్ రంజన్' మూవీలో కిరణ్ అబ్బవరం సరసన నేహా శెట్టి నటిస్తోంది. ఈ సినిమాను స్ట్రైట్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో దివ్యాంగ్, వేమూరి మురళీ కృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో మెహర్ చహల్, వెన్నెల కిశోర్, హైపర్ ఆది, సుబ్బరాజు, వైవా హర్ష వంటి వాళ్లు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











