సమ్మోహనుడా అంటూ నేహా శెట్టి మ్యాజిక్.. కిరణ్ అబ్బవరంతో డీజే టిల్లు భామ కెమిస్ట్రీ అదుర్స్

యువ హీరో కిరణ్ అబ్బవరం హిట్స్, ఫ్లాప్స్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలతో దూసుకెళ్తున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్ఆర్ కల్యాణ మండపం, వినరో భాగ్యం విష్ణు కథ లాంటి హిట్లతో తెలుగు సినిమా పరిశ్రమలో తన రేంజ్ పెంచుకొన్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం రూల్స్ రంజన్. ఈ చిత్రంలో డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని దివ్యాంగ్ లావణియా,మురళీ కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమాలోని పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. ఈ సినిమా పాట సృష్టించిన హంగామా గురించిన వివరాల్లోకి వెళితే..

రూల్స్ రంజన్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాలోని మూడు పాటలను ఇటీవల రిలీజ్ చేయగా మంచి రెస్సాన్స్ వస్తున్నది. నాలో లేనే లేను, సమ్మోహనుడా, ఎందుకు రా బాబు పాటలకు మంచి స్పందన లభించింది. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలిచింది.

 Kiran Abbavaram

రూల్స్ రంజన్ సినిమాలోని సమ్మోహనుడా పాట రిలీజైన రోజు నుంచే విశేషంగా ఆకట్టుకొంటున్నది. మెలోడియస్‌గా సాగే ఈ పాట సాహిత్యం, మ్యూజిక్ అందర్నీ పరవశానికి గురిచేస్తున్నది.ఈ పాట తాజాగా 15 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాటలో నేహా శెట్టి సోయగాలు, కిరణ్ అబ్బవరం గ్రేస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ యువతకు గిలిగింతలు పెడుతున్నది.

 Kiran Abbavaram

రూల్స్ రంజన్ సినిమాకు వస్తున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 18వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఎమోషన్స్, రొమాన్స్, హ్యుమర్, మ్యూజిక్ సమపాళ్లలో కుదిరాయి అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకొంటుందని నిర్మాతలు చెబుతున్నారు.

రూల్స్ రంజన్ సినిమాలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టితోపాటు వెన్నెల కిషోర్, హైపర్ ఆది, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, సుబ్బరాజు, అజయ్, గోపరాజు రమణ, బాలీవుడ్ నటులు అన్నుకపూర్,సిద్దార్థ్ సేన్, అతుల్ పర్చురు,విజయ్ పట్కర్, మక్రంద్ దేశ్ పాండే, అభిమన్యు సింగ్, గుల్షన్ పాండే తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పిస్తున్నారు. దిలీప్ కుమార్ సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X