OG: పవన్ కోసం పాట పాడుతున్న స్టార్ హీరో.. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా హిట్టే!
తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే అత్యంత భారీ ఫాలోయింగ్‌తో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న ఆయన.. ఇప్పటికీ తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ మధ్య అయితే పవన్ మరింత జోష్‌తో వరుసగా మూవీలు చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఇప్పటికే పలు చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నారు. అందులో టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే హైప్ అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తీస్తున్నారు.

డిఫరెంట్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'OG' మూవీకి సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల వ్యవధిలోనే సగం కంటే ఎక్కువగా పూర్తైంది. దీంతో ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ వరుసగా అప్‌డేట్లు ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో వచ్చింది. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ కూడా లభించింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుజిత్ కలయికలో తెరకెక్కుతోన్న 'OG' మూవీకి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో పాట పాడబోతున్నాడట. ఆయన ఎవరో కాదు.. కోలీవుడ్ బడా హీరో శింబు అని తాజాగా తెలిసింది.

స్వతహాగా సింగర్ కూడా అయిన శింబు 'OG' మూవీలో ఓ పాటను పాడబోతున్నాడట. గతంలో అతడు ఎన్టీఆర్ 'బాద్‌షా', మనోజ్ 'నేను మీకు తెలుసా', 'పోటుగాడు', రామ్ 'ది వారియర్' సహా పలు చిత్రాల్లో పాటలు పాడాడు. ఇవన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు పవన్ సాంగ్ కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు.
ఇదిలా ఉండగా.. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రాబోతున్న 'OG' చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో చేస్తున్నారు. ఎస్ థమన్ దీనికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











