twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Korameenu music Review.. మీసాల రాజు మీసాలు ఎవరు తీశారు? ఆసక్తికరంగా తెలిసిందిలే కొర్రమీను సాంగ్

    |

    కోరమీను కథ విషయానికి వస్తే... జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరం. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు - ఈ ముగ్గురి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. మంచి కంటెంట్ తో వస్తున్న చిత్రమిది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

    కొరమీను సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజాగా మూవీలోని తెలిసింది లే అనే పాటను మీడియా సమావేశంలో ఆవిష్కరించారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొన్నది. ఈ సినిమా విజయంపై చిత్ర యూనిట్ విశ్వాసం ప్రకటించారు.

    ఇక మెలోడిగా సాగిన తెలిసిందిలో పాటలో ఆనంద్ రవి, ఇందు కుసుమ కెమిస్ట్రీ బాగుంది. ఇక పాట సాహిత్యం ఆకట్టుకొనేలా ఉంది. గ్రామీణ ప్రేమ కథకు కావాల్సిన హంగులన్నీ కనిపించాయి. తెలిసింది లే.. నేడు.. నువ్వేంటో అంటూ లక్ష్మీ ప్రియాంక రాసిన పాటను పార్వతి ఏజీ అద్బుతంగా పాడగా.. ఆనంత్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చాడు.

    Korameenu Movies Telisindi Ley Song review

    పల్లవి:
    తెలిసిందిలే నేడే నువ్వేంటో
    నను నాకిలా చూపే క్షణములోనే
    నేనా నా నేనేనా ఏమో నిజమేనా మాయేమో ఎలా
    నా లో లో నాలోన దిగులే సెలవంటు ఎటుగా పోయిందో ఏమిటో
    మళ్లీ కొత్తగా పుట్టా నాలాగా
    ఇది నీ మాయలే తెలుసునా
    శిలగా నిన్నల్లో బ్రతికిన నన్నే నువ్
    అల లా ఉంచే నింగి అంచునే

    చరణం:
    అసలేమిటో ఏమో ఏమైందో
    బదులన్నదే నా ఈ ప్రశ్నకేదే
    ఈ లోకం ఇంతేనా తీరే మారేనా ఏమో తేలదే
    ఓ ప్రేమల్లో ఓడానా ? లోకువ నేనేనా నన్నే చూసేటి కళ్లకే
    చూసే చూపులో .. నన్నే గుచ్చేటి
    ప్రశ్నే చేరెనే మెల్లగా
    బదులై నాతోనే .. నువ్వే చేరగా.. నా లోకాలే మారే కొత్తగా అంటూ పాట సాగుతుంది.

    కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

    మ్యూజిక్ , స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ : ఆనంద్ రవి
    డైరెక్టర్: శ్రీపతి కర్రి
    నిర్మాత : పెళ్లకూరు సమన్య రెడ్డి.
    పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్, ఫణి కందుకూరి, బియాండ్ మీడియా
    స్టైలిష్: పూజ శేఖర్
    ఎడిటర్: విజయ్ వర్ధన్ కె
    పాటలు: అనంత నారాయణన్ ఏజీ,
    ప్రొడక్షన్స్ డిజైనర్: ముసి ఫణి తేజ
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్ కుమార్ జన స్వామి
    సినిమాటోగ్రాఫర్: కార్తీక్ కొప్పెర
    సౌండ్ డిజైన్: సాయి వర్మ ముదునూరి
    బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సిద్ధార్థ్ సదాశివుని,
    ప్రొడక్షన్ హౌస్: ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్
    మాంగో మీడియా సమర్పణ ,
    డిస్ట్రిబ్యూషన్ : గంగ ఎంటర్టైన్మెంట్స్ ,
    ఆడియో: మాంగో

    English summary
    Sripathy Karri's Korameenu movie's Telisindi Ley song Unveiled. This song looks very feel Good. here is the song review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X