కేటీఆర్‌ను కలిసిన రాహుల్.. కారణం అదే.. జీవితానికి ఇది చాలన్న బిగ్‌బాస్ విజేత
బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్ విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడు. అంతకు ముందు ప్రైవేట్ ఆల్బమ్స్, ప్లే బ్యాక్ సింగర్‌గా కొద్ది మందికి మాత్రమే తెలిసిన రాహుల్.. బిగ్‌బాస్ షో తరువాత స్టార్ స్టేటస్ అందుకున్నాడు. బిగ్‌బాస్ విన్నర్ ట్యాగ్ రాహుల్ ఇమేజ్ అమాంతం వంద రెట్లు పెంచేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో రాహుల్ ఆడిన విధానం, నిజాయితీగా నిలబడటం, పునర్నవితో కెమిస్ట్రీ, ముక్కుసూటితనం, ఇలా ఎన్నో లక్షణాలతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుని ఎంతో మందికి దగ్గరయ్యాడు.
ప్రస్తుత విపత్కర పరిస్థితిలోనూ తనకు చేతనైన సాయాన్ని చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. తాజాగా కేటీఆర్‌ను కలిసిన సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అసలు కేటీఆర్‌ను ఎందుకు కలిశాడ? ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

చేతనైనా సాయం చేసిన రాహుల్..
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. ఇంకెంతో మందికి తిండి కూడా కరువైంది. ఈ నేపథ్యంలో రాహుల్ సిప్లిగంజ్ ఫుడ్ ప్యాకెట్లను, పళ్లను పంచుతూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

కరోనాపై అవగాహన..
ఇక కరోనా వైరస్‌పై అవగాహన కల్గించేందుకు టాలీవుడ్ సెలెబ్రిటీలెందరో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కీరవాణి, కోటి, రామ్ గోపాల్ వర్మ, మంచు మనోజ్ వంటి వారెందరో కరోనాపై పాటలు రచించి పాడారు. ఈ మేరకు ఆ పాటలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తాజాగా రాహుల్ సైతం..
తాజాగా రాహుల్ సిప్లిగంజ్ కూడా ఈ బాటలోనే పయనించాడ. కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుధ్ద్య కార్మికులకు అంకితం ఇచ్చేలా ఓ పాటను రూపొందించారు. ఈ పాటను కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేయించారు.
జీవితానికి ఇది చాలు..
ఈ మేరకు కేటీఆర్‌ను కలిసిన క్షణాలను పదిలం చేసుకుంటూ దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘ఫ్యాన్ బాయ్ మూమెంట్.. కల నిజమైంది.. మీకు మీ మాటలకు పెద్ద అభిమానిని కేటీఆర్ అన్న.. మీ వినయం, మానవత్వం చూసి ముగ్దుడినయ్యాను.. నా జీవితంలో ఈ క్షణాలు చాలు.. ఒక్క థ్యాంక్స్ చెప్పి ఊరుకోలేను.. మీ దగ్గరి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది..కుదోస్.. బొంతు శ్రీదేవి గారికి, బొంతు రామ్మోహన్ సర్‌కు ధన్యవాదాలు'అని పోస్ట్ చేశాడు.
Recommended Video

పాటను షేర్ చేసిన కేటీఆర్..
కందికొండ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు. కేటీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన విజువల్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. కరోనా వైరస్‌పై పోరాడుతున్న వారందరికీ అంకితమిచ్చేలా అద్భుతంగా స్వరపరిచారు. దీన్ని ముందుకు తీసుకొచ్చిన బొంతు శ్రీదేవి, రాహుల్ సిప్లిగంజ్, కందికొండకు ధన్యవాదాల'ని తెలిపాడు.


Click it and Unblock the Notifications











