Kushi: విజయ్ కోసం రంగంలోకి సిద్.. ఇది మామూలు ప్లాన్ కాదుగా!

టాలీవుడ్‌లో తనదైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. అదే సమయంలో విలక్షణమైన యాక్టింగ్‌కు తోడు తనదైన బాడీ లాంగ్వేజ్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. అయితే, మొదట్లో వచ్చినట్లుగా ఇప్పుడు విజయ్ పెద్దగా విజయాలను అందుకోవడం లేదు. పైగా 'లైగర్'తో అతడు టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లను చవి చూశాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'ఖుషి' అనే సినిమాతో రాబోతున్నాడు.

విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న సినిమానే 'ఖుషి'. ఇందులో సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌తో పాటు పాటను విడుదల చేశారు. వీటికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో సినిమాపై అంచనాలు కూడా భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం నుంచి మరిన్ని అప్‌డేట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా మరో ప్రకటన వదిలారు.

Kushi Movie

'ఖుషి' మూవీ నుంచి వచ్చిన మొదటి పాట సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు చిత్ర యూనిట్ రెండో దాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 'ఆరాధ్య' అంటూ సాగే ఈ సాంగ్‌ను జూలై 12వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు, జూలై 10న ఈ పాట ప్రోమోను వదలబోతున్నారు. ఈ విషయాన్ని 'ఖుషి' టీమ్ శనివారం రాత్రే ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించినట్లు తెలిసింది. ఇది మొదటి పాట కంటే ఆకట్టుకునేలా ట్యూన్ చేసింది అని కూడా టాక్ వినిపిస్తోంది. దీంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.

ఇదిలా ఉండగా.. ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్న 'ఖుషి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X