ఆచార్య: మొదటి సాంగ్ తో మరో రికార్డ్ అందుకున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ తుది దశకు చేరుకుంది. కోవిడ్ వలన బ్రేక్ పడింది గాని లేకపోతే కొరటాల ఎప్పుడో పూర్తి చేసేవారు. ఇక సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.

చాలా కాలం తరువాత మెగాస్టార్ - మణిశర్మ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఆడియో పై మొదటి నుంచి కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక మొదటి సాంగ్ 'లాహే లాహే' కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి వీణ స్టెప్పుతోనే మరోసారి ట్రెండ్ సెట్ చేశాడు. ఈ వయసులో కూడా అంత సునాయాసంగా స్టెప్పులు వేయడంతో నేటితరం హీరోలు కూడా షాక్ అవుతున్నారు.

Laahe Laahe Lyrical Creates new record in youtube

ఇక లాహే లాహే సాంగ్ ఇప్పటికే 30మిలియన్ల వ్యూవ్స్ అందుకుంది. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా హారిక నారాయణ్ , సాహితీ చాగంటి పాడారు. ఇక త్వరలోనే మరొక సాంగ్ ను కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. ఆ సాంగ్ లో రామ్ చరణ్ కూడా మెగాస్టార్ తో కలిసి స్టెప్పులు వేస్తాడట. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సిద్దా అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక అన్ని వర్గాల ప్రేక్షకులతో స్టెప్పులు వేయించే చిరు తనయుల పాట విడుదలపై త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X