For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Lady Gaga ‘ఆ నిర్మాత నన్ను రేప్ చేశాడు.. కొన్నేళ్లపాటు ఆ నరకం, బాధ.. గర్భవతిని చేసి..’

  |

  లైంగిక దాడులు, అత్యాచార సంఘటనలు మహిళలకు చేదు అనుభవాలను మిగిల్చుతుంటాయి. ఆ పైశాచిక సంఘటనలతో మహిళలు మానసిక క్షోభకు గురికావడమనే సందర్భాలను ఎన్నో చూసి ఉంటాం. ఇలాంటి సంఘటన తన జీవితాన్ని అతలాకుతలం చేసిందంటూ మ్యూజిక్ ప్రపంచంలో సంచలన గాయని, నిర్మాత, నటి లేడి గాగ తన దుర్భరైన అనుభవాలను ఇటీవల పంచుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

  యాపిల్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో

  యాపిల్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో

  పాప్ మ్యూజిక్ ప్రపంచంలో లేడి గాగ విశిష్టత, ప్రతిభ ఏంటో అందరికి తేలిసిందే. అసాధారణ ప్రతిభ చూపిన లేడి గాగ ఇటీవల యాపిల్ టీవీ+‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టారు. మానసిక రుగ్మత గురించి ప్రముఖ హోస్ట్ ఓప్రా విన్‌ఫ్రే, ప్రిన్స్ హ్యారీ సంయుక్తంగా నిర్వహించిన ది మీ యూ కాంట్ సీ అనే కార్యక్రమంలో గాగా తన అనుభవాలను పంచుకొన్నారు.

   నీ బట్టలు విప్పేయ్ అంటూ

  నీ బట్టలు విప్పేయ్ అంటూ

  ఓ నిర్మాత తనతో ప్రవర్తించిన తీరును లేడి గాగ వెల్లడిస్తూ.. నీ బట్టలు మొత్తం విప్పేయ్ అని అన్నాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. అక్కడి పరిస్థితి చూసి నిర్మాత వద్ద నుంచి నేను వెళ్లిపోయేందుకు ప్రయత్నించాను. అప్పుడు నా మ్యూజిక్ ఆల్బమ్స్ అన్నీ తగలబెడుతామని బెదిరించారు. ఆ తర్వాత నేను అక్కడే శిలలా నిలబడిపోయాను అని లేడి గాగ తెలిపారు.

   భయంతో వణికిపోయాను..

  భయంతో వణికిపోయాను..

  2014లో జరిగిన లైంగిక దాడిని గుర్తు తెచ్చుకొంటూ.. అలా నేను అక్కడే భయంతో వణికిపోయాను. ఆ తర్వాత నా ప్రమేయం లేకుండానే అంతా జరిగిపోయింది. అసలేం జరుగుతున్నదనే విషయం కూడా నాకు ఆసమయంలో గుర్తుకు రాలేదు అని లేడి గాగ పేర్కొన్నారు.

  మెదడు మొద్దుబారి

  మెదడు మొద్దుబారి

  నాపై వారు జరిపిన రేప్ తర్వాత విపరీతమైన బాధతో నరకాన్ని చూశాను. మెదడు మొద్దు బారిపోయింది. చాలా వారాలపాటు అనారోగ్యంతో కోలుకోలేకపోయాను. చాలా వారాల తర్వాత ఆ రేప్ బాధ ఏంటో, ఆ నరకం తీవ్రత ఏంటోననే విషయం అర్ధమైంది. నాపై మానభంగం జరిపి గర్భవతిగా చేసి ఓ మూలకు పడేశారు అంటూ లేడి గాగ వెల్లడించారు.

   ఏన్నో ఏళ్లపాటు మానసిక క్షోభ

  ఏన్నో ఏళ్లపాటు మానసిక క్షోభ


  అత్యాచార ఘటనను తలచుకొంటూ.. ఆ మానసిక రుగ్మత, భయాందోళనల నుంచి బయటపడటానికి చాలా సంవత్సరాలు పట్టింది. చాలా ఏళ్లకు గానీ నేను సాధారణ యువతిగా మారలేకపోయాను అని లేడిగాగ తన ఆవేదనను వ్యక్తం చేసింది. అయితే తనపై లైంగిక దాడి జరిపిన వారి వివరాలను వెల్లడించడానికి ఆమె నిరాకరించారు.

   నిర్మాత పేరు బయటపెడితే..

  నిర్మాత పేరు బయటపెడితే..

  అయితే నాకు మీటూ మూమెంట్ గురించి అంతా తెలుసు. వారి పేర్లను బయటపెడితే కొందరికి రిలీఫ్ ఉంటుంది. కానీ నాకు మానసిక ప్రశాంతత ఉండదనే విషయం స్పష్టంగా తెలుసు. అందుకే లైంగిక దాడి చేసిన ప్రొడ్యూసర్ పేరును బయటపెట్టను అని అన్నారు. నా మాదిరిగా మానసిక సమస్యలతో బాధపడేవారి కోసం బార్న్ దిస్ వే ఫౌండేషన్‌ను ప్రారంభించాను అని తెలిపారు.

  లేడి గాగ కెరీర్ ఇలా..

  లేడి గాగ కెరీర్ ఇలా..

  లేడి గాగ కెరీర్ విషయానికి వస్తే.. ది ఫేమ్, బార్న్ దిస్ వే, ఆర్ట్‌పాప్, చీక్ టూ చీక్, జోన్నే, క్రోమాటికా లాంటి ఆల్బమ్స్‌తో అత్యంత ప్రేక్షకాదరణ పొందారు. అలాగే మచేట్టే కిల్స్, సిని సిటీ: ఏ డేమ్ టు కిల్ ఫర్, గాగ: ఫైవ్ ఫూట్, టూ, ఈ స్టార్ ఈజ్ బార్న్, హౌజ్ ఆఫ్ గుసీ వీడియో అల్బమ్స్‌లో నటించారు.

  English summary
  Pop Sensation Lady Gaga reveals rape and sexual assault by producer in a 2014. She speak lot of things in Oprah Winfrey and Prince Harry's series "The Me You Can't See" on Apple TV.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X