శివాజీ గణేశన్ మనవడితో శ్రీదేవి మేనకోడలతో పద్మిని మనవరాలు లక్ష్మీ దేవి.. 'ఎదలో మౌనం' అంటూ!
లెక్కకు మిక్కిలి పురస్కారాలు మాత్రమే కాక ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దివంగత నటి, భరతనాట్యం కళాకారిణి పద్మిని రామచంద్రన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె న్యూజెర్సీలో భారతీయ శాస్త్రీయ నృత్యం కోసం ఒక ప్రభావవంతమైన పాఠశాలను ప్రారంభించింది, ఆమె సెప్టెంబర్ 25న భారతదేశంలోని చెన్నైలో 2006లో మరణించారు. చనిపోయే నాటికి ఆమె వయసు 74. అనేక భారతీయ భాషల్లో 250కి పైగా సినిమాలు చేసిన తర్వాత, ఆమె 1970లో పదవీ విరమణ చేసి తన భర్త డా. కె.టి. రామచంద్రన్‌తో కలిసి హిల్స్‌డేల్, న్యూ జేరసీలో సెటిల్ అయ్యారు.
అలాంటి ఆమె మనవరాలు లక్ష్మీ దేవి రూపొందిస్తున్న మ్యూజిక్ వీడియో 'ఎదలో మౌనం'. ఇందులో నడిగర్ తిలగం శివాజీ గణేశన్ మనవడు దర్శన్, శ్రీదేవి మేనకోడలు శిరీష జంటగా కనిపించనున్నారు. శివాజీ గణేశన్, పద్మిని సుమారు 59 చిత్రాల్లో జంటగా నటించారు. ఇప్పుడు పద్మిని మనవరాలు లక్ష్మీ దేవి దర్శకత్వంలో శివాజీ గణేశన్ మనవడు ఓ మ్యూజిక్ వీడియో చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోలో విఘ్నేష్ శివ సుబ్రమణియన్, వేస్త చెన్ కూడా భాగం అయ్యారు.

కొత్త సంగీత దర్శకుడు వరుణ్ మీనన్‌తో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు అచ్చు రాజమణి స్వరపరిచిన బాణీతో ఈ మ్యూజిక్ వీడియో రూపొందుతోంది. ఈ పాటను అచ్చు రాజమణి ఆలపించారు. సూర్య హీరోగా నటించిన 'బందోబస్తు'కు సినిమాటోగ్రఫీ అందించిన అభినందన్ రామానుజం ఈ మ్యూజిక్ వీడియోకు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ పాటకు ఆంటోనీ గొంజాల్వెజ్ ఎడిటర్ కాగా ఆయన గతంలో ఫేమస్ దర్శకులు శంకర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాలకు పని చేశారు. ఇక ఆస్కార్ పురస్కారాల్లో 'లైఫ్ యాక్షన్ షార్ట్' కేటగిరీలో పోటీ పడుతున్న 'వెన్ ద మ్యూజిక్ చేంజెస్' తర్వాత లక్ష్మీ దేవి దర్శకత్వంలో ఈ మ్యూజిక్ వీడియో రూపొందింది. దీనికి 'ఎదలో మౌనం' అని పేరు ఫిక్స్ చేశారు.


Click it and Unblock the Notifications











