Don't Miss!
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Bheemla Nayak: లాలా భీమ్లా సాంగ్ వచ్చేసింది.. అభిమానులకి పూనకాలేగా ఇక!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా నుంచి తాజా అప్డేట్ వచ్చేసింది. దీపావళిని ది సౌండ్ ఆఫ్ భీమ్లా నాయక్ తో అడ్వాన్స్ గా సెలబ్రేట్ చేసుకోండి అంటూ సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాలా భీమ్లా అనే సాంగ్ వీడియో ప్రోమో మొన్న ఒకదానిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సాంగ్ ను విడుదల చేశారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మలయాళంలో ఈ సినిమాను చూసిన సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత నాగ వంశీ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు కొని ముందుగా ఒక హీరోగా రానా ఎంపిక చేసుకోగా మరో హీరో విషయంలో అనేక మల్లగుల్లాలు పడ్డారు. ఆ తర్వాత ఫైనల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ఫైనల్ చేశారు. మలయాళంలో బిజు మీనన్ చేసిన పోలీసు అధికారి పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తూండగా, అక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన మాజీ మిలిటరీ మేయర్ పాత్రలో రానా దగ్గుబాటి రానా నటిస్తున్నారు.
రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకోగా సినిమా నుంచి విడుదలైన దాదాపు అన్ని పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లాలా బీమ్లా అయితే భీభత్సమైన క్రేజ్ రావడంతో ఆ సాంగ్ కోసం అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సహా సినిమా ప్రేమికులు సైతం విపరీతంగా ఎదురుచూస్తున్నారు.
ఇక తాజాగా దీపావళికి అడ్వాన్స్ విషెస్ చెబుతూ సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఒక అధికారిక వీడియోను విడుదల చేసింది.. పూర్తి పాటను నవంబరు 7వ తారీకు విడుదల చేస్తున్నామని చెబుతూ 40 సెకన్ల వీడియో ప్రోమో విడుదల చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ దీపావళి ఎంజాయ్ చేయగా అన్నట్టుగానే చెప్పిన సమయానికి త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా 'భీమ్లా నాయక్' నుంచి మరో సాంగ్ విడుదల అయింది.
ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్, ఈ గీతాన్ని రచించటం మరో విశేషం. మాటల్లో మాత్రమే కాదు పాటలలో సైతం తనదైన శైలిని పలికించారన్నది ఈ సాంగ్ ద్వారా క్లారిటీ వచ్చింది. 'భీమ్లా నాయక్' పోరాట సన్నివేశాల్లో భాగంగా ఈ సాంగ్ ఉంటుందని, తమన్ స్వరాలు, అరుణ్ కౌండిన్య గాత్రం ఆవేశాన్ని రగిలిస్తే, రెండు నిమిషాల ముప్ఫై సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయని సినిమా యూనిట్ పేర్కొంది. సాంగ్‌లో థమన్ డ్రమ్స్ వాయిస్తుంటే డ్యాన్సర్స్ పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు.
ఈ పాట ఫ్యాన్స్‌కి కూడా పూనకాలు తెప్పిస్తుందనే చెప్పాలి. కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండగా ఈ సినిమాను సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మితమవుతున్న ఈ సినిమాకు ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. 'భీమ్లా నాయక్' చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉండగా రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరి కిరణ్, చిట్టి, పమ్మి సాయి, కీల;ఆ పాత్రలలో నటిస్తున్నారు.