Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Lata Mangeshkar కోలుకోవాలని మహా మృత్యుంజయ యాగం.. పూజలు ఎవరు చేశారంటే?
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ అనారోగ్య పరిస్థితుల్లో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. కోవిడ్ 19 పాజిటివ్, న్యుమోనియా వ్యాధితో ఆమె హాస్పిటల్‌లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. జనవరి 8వ తేదీన హాస్పిటల్లో చేరిన ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స జరుగుతుందని ప్రతీ రోజు హెల్త్ బులెటిన్‌లో వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ఆమె ఆరోగ్యం గురించి ఎలాంటి రూమర్లు, తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని వైద్యులు, ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని భగంతుడిని ప్రార్తించాలని సూచిస్తున్నారు.
తాజా హెల్త్ బులెటిన్‌లో వైద్యులు.. లత మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. కానీ ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నాం. దీది ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దు. చాలా బాధగా ఉంది అంటూ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ లతా మంగేష్కర్ కోలుకోవాలని మహా మృత్యుంజయ యాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహా మృత్యంజయ పూజలో జపాలు పఠించాం. ఆమె ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుకొంటున్నాం. ఐసీయూలో చికిత్స పొందుతున్న లతా మంగేష్కర్‌ను ప్రధాని మోదీ పరామర్శించాలని కోరారు.
లతా మంగేష్కర్ కెరీర్ విషయానికి వస్తే.. 1942 సంవత్సరంలో తన 13వ ఏట తొలి పాటను పాడారు. అప్పటి నుంచి సుమారు 30 వేల పాటలకుపైగా ఆలపించారు. సినీ సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గాను.. ఆమెకు అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకొన్నారు. మూడుసార్లు ఉత్తమ జాతీయ గాయనిగా అవార్డు స్వీకరించారు. ఇంకా పలు అవార్డులతో సత్కరించారు.