ఇంటర్నెట్ సెన్సేషన్ రణు మండల్ పై లతా మంగేష్కర్ ఏమన్నారంటే..?

రైల్వే ఫ్లాట్ ఫాంపై పాటలు పాడుకునే రణు మొండల్‌ ఇంటర్నెట్ సంచలనంగా మారిపోయిన సంగతి తెలిసిందే. లతా మంగేష్కర్ పాట 'ఏక్ ప్యార్ కా నాగ్మా హై' పాడిన వీడియో వైరల్ కావడంతో ఆమె గురించి అందరికీ తెలిసింది. రణు మొండల్ గురించి స్పందించాలని ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ను కోరగా ఆమె ఇలా స్పందించారు. 'ఎవరైనా నా పేరు, పని నుండి లబ్ది పొందినట్లయితే నేను అదృష్టంగా భావిస్తాను' అన్నారు.

"అయితే అనుకరణ విజయానికి నమ్మకమైన, మన్నికైన మార్గం కాదని నేను భావిస్తున్నాను. నా పాటలు లేదా కిషోర్ కుమార్, రఫీ సాబ్, ముఖేష్ భయ్యా, ఆశా భోస్లే పాటలు పాడటం ద్వారా స్వల్పకాలిక గుర్తింపు పొందవచ్చు... కానీ అది చివరి వరకు ఉండదు." అన్నారు.

Lata Mangeshkar Reacts To Internet Sensation Ranu Mondal

"చాలా మంది పిల్లలు నా పాటలను అందంగా పాడతారు. అయితే, వారిలో ఎంతమంది మొదటి సక్సెస్ తర్వాత గుర్తుండిపోయారు? నాకు సునిధి చౌహాన్, శ్రేయా ఘోషల్ గురించి మాత్రమే తెలుసు." అని లతా మంగేష్కర్ ఉదహరించారు.

"పాటలు పాడే విషయంలో మీరు ఒరిజినల్‌గా ఉండండి. సింగర్స్ తమదైన స్టైల్ అలవరుచుకోవాలి. ఆశా భోస్లే తనదైన శైలిలో పాటలు పాడి ఉండకపోతే ఆమె ఎప్పటికీ నా నీడలో ఉండిపోయేది. ప్రత్యేక అస్తిత్వం ఒకరి ప్రతిభను ఎంతవరకు తీసుకెళుతుందనే దానికి ఆమె అతిపెద్ద ఉదాహరణ. " అని అతా మంగేష్కర్ చెప్పుకొచ్చారు.

కాగా... బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రణుకు ఫ్లాట్ బహుమతిగా ఇచ్చినట్లు గతంలో పుకార్లు వచ్చాయి, ఇది అబద్ధమని తేలింది. అయితే, హిమేష్ రేషమియా తరఫున పాడే అవకాశం ఆమెకు లభించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X