ఏదో మైకంలో తేలిపోతుంటే.. అంటూ లావణ్య త్రిపాఠి పార్టీ సాంగ్
నూతన దర్శకుడు రితేష్ రానా రూపొందిస్తున్న హ్యాపీ బర్త్ డే చిత్రం లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో మైత్రీ మూవీస్ సీఈవో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా హ్యాపీ బర్త్ డే సినిమా విడుదల కాబోతున్నది. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు, రివీల్ చేసిన ప్రతీ క్యారెక్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజాగా హ్యాపీ బర్త్ డే సినిమా నుంచి ఓన్లీ లీగల్ పార్టీ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అంటూ జోష్ ఫుల్ పాటను విడుదల చేశారు. ఈ పార్టీ సాంగ్‌కు కాలభైరవ మంచి ట్యూన్ ఇవ్వగా, గాయని దామినీ భాట్ల అదే జోష్‌తో పాడారు. ఈ పాటకు కిట్టూ విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించారు. ఈ పాటకు లావణ్య త్రిపాఠీ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ మారాయి.

ఏదో మైకంలో తేలిపోతుంటే..
తూలిపోతుంటే ఈ వేళ
తేరా మేరా లేదంటూ..
తేడా లేక సాగాలి ఈ పైనా
రోజు ఊరిస్తూ.. దాగిపోనట్టు..
లాగుతూ ఉండే దీవానా
రేపు మాపంటూ వాయిదా వేస్తూ..పోను ఏమైనా
అంధేరా.. అంధేరా
ఓడించే.. అంతేనా
సంగీతం: కాలభైరవ
డిఓపీ: సురేష్ సారంగం
ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్
ఫైట్స్: శంకర్ ఉయ్యాల
కాస్ట్యూమ్ డిజైనర్: తేజ్ ఆర్
లైన్ ప్రాడ్యూసర్: అలేఖ్య పెదమల్లు
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయి
చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాల సుబ్రమణ్యం కేవీవీ
ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కుమార్ కందుల
మార్కెటింగ్: ఫస్ట్‌షో
పీఆర్‌ఓ:మడూరి మధు
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: రితేష్ రానా.



Click it and Unblock the Notifications











