లెజెండరీ సింగర్ సుశీలకు తీవ్ర అస్వస్థత.. చెన్నైలోని హాస్పిటల్‌లో చేరిక
ప్రముఖ గాయని, పద్మ భూషణ్ పీ సుశీల తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమెను హుటాహుటిన చెన్నైలోని హాస్పిటల్‌లో చేర్పించారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేర్పించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి వివరాల్లోకి వెళితే..
86 సంవత్సరాల లెజెండరీ సింగర్ పీ సుశీల ఆదివారం తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడటంతో కుటుంబ సభ్యులు వెంటనే కావేరి హాస్పిటల్‌కు తరలించారు. కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత ఆోర్య సమస్యలతో ఆమె బాధపడుతున్న విషయం తెలిసింది. కావేరీ హస్పిటల్ వర్గాలు, నిపుణులైన వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నారు.

సుశీల ఆరోగ్యం గురించి అభిమానులు, సన్నిహితులు,స్నేహితులు ఎలాంటి కలత చెంద కూడదు. మరో 24 గడిస్తే గానీ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ చెప్పలేదు. కానీ ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యాన్నికి స్పందిస్తున్నారు అని వైద్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











