twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకే వేదికపై ఎస్పీబీ, ఏసుదాస్, చిత్ర.. 30న ‘లెజెండ్స్‌’ లైవ్‌ కాన్సర్ట్‌

    |

    కె.జె. ఏసుదాస్‌, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెయస్‌ చిత్ర లాంటి లెజెండరీ సింగర్స్‌ తో ఎలెవన్‌ పాయింట్‌టు మరియు బుక్‌ మై షో సంయుక్తంగా 'లెజెండ్స్‌' సంగీత కచేరిని నవంబర్‌ 30న హైదరాబాద్‌లోని గౌచ్చిబౌళి స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్‌ ఆధ్వర్యంలో జరగునుంది. ఈ సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయు ల సమావేశంలో ఎస్పీ బా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ...'' తెలుగు లో జరుగుతోన్న తొలి సంగీత కచేరి ఇది. నేను, ఏసుదాస్‌ గారు , చిత్ర ముగ్గురం ఈ కచేరీలో కేవలం తెలుగు పాటలు మాత్రమే పాడనున్నాం. గతంలో వేరే కంట్రీస్‌లో సంగీత కచేరీ చేశాం. కానీ తెలుగులో ఇదే ప్రథమం. ఇంతకు ముందు సింగపూర్‌లో మా అబ్బాయి చరణ్‌, ఎలెవన్‌ పాయింట్‌టు మరియు బుక్‌ మై షో వారు దీన్ని అద్భుతంగా నిర్వహించారు.

    ఇక్కడ కూడా అదే విధంగా ఎంతో ప్లాన్డ్‌గా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు నుంచి ప్రొఫెషనల్స్‌ అయిన మ్యుజిషియన్స్‌ ఈ లైవ్‌ షోకు మ్యూజిక్‌ బ్యాండ్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే స్ట్రింగ్స్‌ సెక్షన్‌లో ఏఆర్‌ రహమాన్‌ మ్యూజిక్‌ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన వారు ప్లే చేయనున్నారు. అలాగే రహమాన్‌ కు రైట్‌ హ్యాండ్‌ అయిన శ్రీనివాస మూర్తి కండక్టర్‌గా వ్యవహరించనున్నారు. అన్న ఏసుదాస్‌ గారి పాటతో ప్రారంభమయ్యే ఈ సంగీత కచేరిలో అందరికీ ఇష్టమైన తెలుగు పాటలు పాడనున్నాం. ఇక ఇది కమర్షియల్‌ షో నా? అంటే అవునను చెప్పవచ్చు. ఎంతో ఎక్స్‌పెన్సివ్‌తో కూడింది . వ్యాపార ధోరణిలో చేస్తోన్న ఓ అందమైన సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పవచ్చు'' అన్నారు.

    Legends Live concert: Esudas, SPB, Chitra on one stage

    ఎస్పీ చరణ్‌ మాట్లాడుతూ...'' ఏసుదాస్‌గారు, నాన్నగరారు, చిత్రగారు ఇలా ముగ్గురు ఒక వేదికపై ఆ లపించడం నాతో పాటు అందరికీ వీనుల విందుగానే ఉంటుంది. ఈ లైవ్‌ కాన్సర్ట్‌ రెగ్యులర్‌గా చేయాలని ఉన్నప్పటికీ ముగ్గురు చాలా బిజీగా ఉండటంతో వారి టైమ్‌, డేట్స్‌ తీసుకుని చేయడం వలన చాలా గ్యాప్‌ వస్తోంది. ఇక ముందు ముందు కూడా ఇలాగే కొనసాగిస్తాం. ఇప్పటి వరకు మేము చేసిన 'లెజెండ్స్‌' ఏ లైవ్‌ కాన్సర్ట్‌' అంతటా మంచి సక్సెస్‌ అయింది. హైదరాబాద్‌లో నవంబర్‌ 30న గచ్చిబౌళి స్టేడియంలో గ్రాండ్‌గా చేస్తున్నాం. ఈ ముగ్గురు లెజెండ్స్‌ ఇప్పటి వరకు తెలుగులో ఎన్నో వేల పాటలు పాడారు. అందులో కొన్ని పాటలు సెలెక్ట్ చేయడం అంటే కొంచెం ఇబ్బందే. అయినా కూడా శ్రోత లకు బెస్ట్‌ సాంగ్స్‌ అందించే ప్రయత్నం చేస్తాం'' అన్నారు.

    English summary
    KJ Esudas, SP Balasubramaniam, KS Chitra are combinedly perform Legents Live Concert. Book My Show, other organisation are parters of this event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X